IPL 2022: భారత్ లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ లో నిర్వహించేందుకు బీసీసీఐ సంకల్పించింది. కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతున్న క్రమంలో కరోనా తీవ్రత పెరగనుందని తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ దేశంలోనే నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. విదేశాల్లో నిర్వహించేందుకు కేవలం ఆప్షన్లు మాత్రమే పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణపై విదేశాల్లో వేదికలు ఎంచుకునే వీలుంది. కానీ ఐపీఎల్ వేలంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఆటగాళ్ల వేలం కోసం చర్యలు తీసుకుంటోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ షెడ్యూల్ మాత్రం ఇంకా ప్రకటించడం లేదు. ఏప్రిల్ తొలి వారంలో నిర్వహించేందుకు ప్లాన్ చేసినా ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అవసరమైతేనే విదేశాల్లో మ్యాచ్ లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మ్యాచ్ ల నిర్వహణకు భారత్ నే ఎంచుకోవాలని చూస్తోంది. మొదటి ప్రాధాన్యత భారత్ కే ఇస్తుందని చెబుతున్నారు. దీంతో ఐపీఎల్ నిర్వహణపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఆటగాళ్ల ఎంపిక పూర్తి కావడం తెలిసిందే.
Also Read: Warner: వార్నర్ ను తప్పించి సన్ రైజర్స్ ఏం సాధించింది
ప్రతి ఏడాది వేసవిలో ఐపీఎల్ నిర్వహించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతాయి. హైదరాబాద్ సన్ రైజర్ తన కెప్టెన్ ను మార్చుకుంది. బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కూడా ఆటగాళ్లను ఎంచుకుంది. ఇంకా రెండు కొత్త జట్లు ఈవెంట్లలో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తి పెరుగుతోంది.
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. బీసీసీఐ సంచలన నిర్ణయం