Pawan Kalyan new hairstyle: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమా షూటింగ్స్ సమయం లో ఒక లుక్ తో, అదే విధంగా రాజకీయాల్లో బిజీ గా ఉన్నప్పుడు మరో లుక్ తో కనిపించడమే ఇన్ని రోజులు మనం చూస్తూ వచ్చాం. పొలిటికల్ గా బిజీ ఉన్నప్పుడు ఆయన తెల్ల బట్టలు ధరించి, గెడ్డం, జుట్టు బాగా పెంచేసి కనిపించేవాడు. కానీ ఈమధ్య కాలం లో ఆయన సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ సైడ్ కట్టింగ్స్ చేసి, ఫ్యాన్స్ కి చాలా కొత్తగా కనిపించడం మొదలు పెట్టాడు. పాత బస్తీ లో రౌడీలు ఉంటారు చూసారా?, అలాంటి లుక్ లో కనిపించాడు పవన్ కళ్యాణ్. మెల్లగా ఈ లుక్ కి ఫ్యాన్స్ కూడా అలవాటు పడ్డారు. కానీ రీసెంట్ గానే ఆయన ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ కి ఒక ఖరీదైన కారుని బహుమతిగా ఇస్తూ కనిపించాడు.
ఆ సమయం లో పవన్ కళ్యాణ్ లుక్ ని చూసి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా షాక్ కి గురి అయ్యారు. పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ హెయిర్ స్టైల్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ లోని ‘దేఖ్లేంగే సాలా’ పాటలో పవన్ కళ్యాణ్ జుట్టు అలా ఎగురుతూ కనిపించడం చూసి అభిమానులు మెంటలెక్కిపోయారు. చిన్నప్పటి నుండి మనం చూస్తూ పెరిగింది ఇలాంటి పవన్ కళ్యాణ్ నే కదా అని అంతా కామెంట్ చేశారు. కానీ మొట్టమొదటి సారి, పవన్ కళ్యాణ్ కలలో కూడా ఊహించని సరికొత్త గెటప్ లో కనిపించడం తో, ఏంటన్నా ఇలా తయారయ్యావ్, అసలు బాగాలేదు, దయచేసి మార్చేయ్ అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది అయితే, ఇది నిజంగా పవన్ కళ్యాణ్ యేనా?, గుర్తు పెట్టడానికే చాలా సమయం పట్టింది అంటూ కామెంట్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ హెయిర్ స్టైల్ లో కనిపించడానికి అసలు కారణం, ఇది తన కొత్త సినిమాలోని లుక్ అట. ఏ సినిమాకి సంబంధించిన లుక్ అనేది ప్రస్తుతానికి బయటపడలేదు. లోకేష్ కనకరాజ్ తో ఆయన ఒక సినిమా చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చాలా రోజుల నుండి వినిపిస్తున్న టాక్. ఈ లుక్ ఆయన ఆ సినిమాకు సంబంధించినదేనా?, లుక్ టెస్ట్ జరిగిన తర్వాత నుండి పవన్ కళ్యాణ్ ఈ స్టైల్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నాడా అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తే కానీ తెలియదు. కానీ ఇంత కచ్చితంగా లుక్ ని మైంటైన్ చేస్తున్నాడంటే, కచ్చితంగా సినిమాకు సంబంధించినదే అని అంటున్నారు ఫ్యాన్స్.