విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం జగన్ శుభవార్త.. ఏం చేశారంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో గతంతో పోలిస్తే ఏకంగా 30 శాతం ఫీజులను తగ్గించారు. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో పరిస్థితులు […]

Written By: Kusuma Aggunna, Updated On : October 31, 2020 8:28 am
Follow us on


ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో గతంతో పోలిస్తే ఏకంగా 30 శాతం ఫీజులను తగ్గించారు. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూరనుంది.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రజల ఆదాయం గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గడంతో వ్యాపార రంగాలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి కేవలం 70 శాతం ఫీజును మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల కాలేజీల పనిదినాలు కూడా భారీగా తగ్గాయి. అందువల్ల ఫీజులను తగ్గించినా కాలేజీల నుంచి వ్యతిరేకత వ్యకం కాకపోవచ్చు. కాలేజీలు విద్యాశాఖ ఆదేశాలను లెక్క చేయకుండా ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని జగన్ సర్కార్ భావిస్తోంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానుండగా కరోనా వైరస్ సోకకుండా జగన్ సర్కార్ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో 2వ తేదీ నుంచి 9,10, ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 23వ తేదీ నుంచి 6,7,8 తరగతులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. 1,2,3,4,5 తరగతులకు డిసెంబర్ నెల 14వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో రోజు విడిచి రోజు పాఠశాలలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.