https://oktelugu.com/

ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు.. ఖర్చు తెలిస్తే షాకే..!

దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా దెబ్బకు ఇది అది అనే తేడా లేకుండా అన్నిరంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా వలస కార్మికుల జీవనం అస్తవ్యస్తం అయింది. అదేవిధంగా సినీ పరిశ్రమ, క్రీడారంగానికి కోలుకులేని దెబ్బ తాకింది. సినీ పరిశ్రమ ఇప్పట్లో తెరుకునేలా కన్పించకపోయినా క్రీడారంగం మాత్రం కొద్దిగా కొద్దిగా కోలుకుంటోంది. మనదేశంలో ఎన్ని ఆటలున్న.. క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే కరోనా కారణంగా టీ-20 కప్ వాయిదా పడగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2020 12:50 pm
    Follow us on

    దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా దెబ్బకు ఇది అది అనే తేడా లేకుండా అన్నిరంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా వలస కార్మికుల జీవనం అస్తవ్యస్తం అయింది. అదేవిధంగా సినీ పరిశ్రమ, క్రీడారంగానికి కోలుకులేని దెబ్బ తాకింది. సినీ పరిశ్రమ ఇప్పట్లో తెరుకునేలా కన్పించకపోయినా క్రీడారంగం మాత్రం కొద్దిగా కొద్దిగా కోలుకుంటోంది.

    మనదేశంలో ఎన్ని ఆటలున్న.. క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే కరోనా కారణంగా టీ-20 కప్ వాయిదా పడగా పలు అంతర్జాతీయ మ్యాచులు రద్దయ్యాయి. కాగా ఇప్పుడిప్పుడు కొన్ని జట్లు కరోనా నిబంధనలు కఠినంగా పాటిస్తూ ప్రేక్షకుల్లేకుండానే మ్యాచులను నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది.

    కరోనా సవాళ్లను ఎదుర్కొంటునే మ్యాచులను నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతోంది. ఈసారి ఐపీఎల్ యూఏఈలో జరుగనుంది. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ జరుగనుందని సమాచారం. ఐపీఎల్ కోసం బీసీసీఐ ఆటగాళ్లందరికీ 10కోట్ల భారీ ఖర్చుతో కరోనా టెస్టులను నిర్వహిస్తోంది. భారత్ లో ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా టెస్టులకు ఎనిమిది ప్రాంచైజీలు ఖర్చును భరించాయి.

    అయితే యూఏఈలో ఐపీఎల్ ఆటగాళ్లు అడుగుపెట్టినప్పటి నుంచి ముగిసే వరకు అన్ని టెస్టులకు బీసీసీఐ ఖర్చు భరించనుంది. ఇప్పటికే యూఏఈకి చెందిన వీపిఎస్ హెల్త్ కేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 20వేల మందికి కరోనా టెస్టులను నిర్వహించనున్నారు. ఒక్కో టెస్టుకు పన్నులు మినహా రూ.4వేలు(200 దిర్హామ్) చెల్లించనున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.

    ప్రస్తుతం తాము రిస్కు తీసుకోలేదని.. ఆటగాళ్ల కోసం ప్రత్యేక హోటల్ ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు కరోనా టెస్టులు పూర్తయినట్లు తెలిపారు.