జీడీపీ క్షీణత: అమెరికాదే అగ్రస్థానం.. నెక్ట్స్ భారత్‌దే..  

ఎక్కడో చైనా దేశంలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచమంతటికి పాకి ఛిన్నాభిన్నం చేస్తోంది. ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన అమెరికాను సైతం కకావికలం చేసింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. దాని తర్వాత ఆ ఎఫెక్ట్‌ పడింది మన భారత్‌పైనే. కరోనా మహమ్మారితో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతానికి కుంచించుకుపోయింది. ఇంత భారీ స్థాయిలో జీడీపీ పతనం కావడం ఇదే మొదటిసారి. సుదీర్ఘ లాక్‌డౌన్‌తో మన దేశానికి […]

Written By: NARESH, Updated On : September 2, 2020 12:36 pm
Follow us on

ఎక్కడో చైనా దేశంలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచమంతటికి పాకి ఛిన్నాభిన్నం చేస్తోంది. ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన అమెరికాను సైతం కకావికలం చేసింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. దాని తర్వాత ఆ ఎఫెక్ట్‌ పడింది మన భారత్‌పైనే. కరోనా మహమ్మారితో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతానికి కుంచించుకుపోయింది. ఇంత భారీ స్థాయిలో జీడీపీ పతనం కావడం ఇదే మొదటిసారి. సుదీర్ఘ లాక్‌డౌన్‌తో మన దేశానికి ఈ పరిస్థితి వచ్చినట్లు నిపుణులు అంటున్నారు.

కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆర్థిక మూలాలను భారీగా దెబ్బతీస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌, జూన్ క్వార్టర్‌‌లో ఏకంగా మైనస్‌ 32.9 శాతానికి పడిపోయింది. తర్వాతి స్థానంలో మైనస్‌ 23.9 శాతంతో భారత్‌ ఉంది. 20.9 శాతంతో మూడో స్థానంలో బ్రిటన్‌, 13.8 శాతంతో ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో, 12.4 శాతంతో ఇటలీ ఐదో స్థానంలో, 12 శాతంతో కెనడా ఆరో స్థానంలో, మైనస్‌ 10.1 శాతంతో జర్మనీ ఏడో స్థానంలో, మైనస్‌ 7.6 శాతంతో జపాన్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల్లో భారత్‌, చైనా మినహా మిగతావన్నీ జీ7 కంట్రీసే.

కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మహమ్మారి విజృంభించడంతో జనవరి–మార్చి క్వార్టర్‌‌లో జీడీపీ కేవలం 6.8 శాతమే క్షీణించింది. అదే క్వార్టర్‌‌లో భారత్‌ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదైంది. ఇప్పుడు అదే చైనాలో ప్రస్తుతం వృద్ధి రేటు 3.2 శాతం నమోదు చేసుకోవడం గమనార్హం. మన దేశంలో మాత్రం దారుణ పతనానికి గురైంది. కరోనాతో ఎక్కువ ప్రభావానికి గురైన జర్మనీ 10.1 శాతం మేర ప్రతికూలతను నమోదు చేసింది.

భారత్‌లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కేవలం వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్ మాత్రమే 3.4 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయి. నిర్మాణ రంగం మైనస్ 50.30 శాతం, ట్రేడ్, హోటల్, ట్రాన్స్‌పోర్ట్ మైనస్ 47 శాతం, మానుఫ్యాక్చరింగ్‌ మైనస్ 39.30 శాతం, మైనింగ్ అండ్ క్వారియింగ్ మైనస్ 23.30 శాతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్‌ మైనస్ 10.30 శాతం, ఎలక్ట్రిసిటీ, యుటిలిటీస్ సర్వీసెస్ మైనస్ 7 శాతం మేర క్షీణించాయి.