Hair Health: నేటి కాలంలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి, చెడు జీవనశైలి, కాలుష్యం, చెడు ఆహారం వంటి అనేక కారణాలు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, జుట్టు సంరక్షణ కోసం సహజ నివారణలను ఎంచుకోవడం బెటర్. ఆయుర్వేదంలో “పూర్తి ఔషధం” అనే పేరు సంపాదించిన నువ్వుల నూనె జుట్టు రాలడాన్ని నివారించడంలో, వాటిని బలోపేతం చేయడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
నువ్వుల నూనె పురాతన వైద్యంలో ఒక భాగం మాత్రమే కాదు. నేడు జుట్టు, చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించబడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టు మూలాలకు పోషణనిచ్చి వాటిని చిట్లకుండా కాపాడతాయి. మీరు జుట్టు రాలడం సమస్యతో పోరాడుతుంటే, నువ్వుల నూనె సమర్థవంతమైన, సురక్షితమైన పరిష్కారంగా అందిస్తుంది. దాని ప్రయోజనాలు ఏమిటి? జుట్టు సంరక్షణలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నువ్వుల నూనెలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి?
నువ్వుల నూనె అనేక ముఖ్యమైన పోషకాల నిల్వగా ఉంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ ఇ మూలాలకు పోషణ అందించి జుట్టును బలపరుస్తుంది. ఇక ఇందులోని మెగ్నీషియం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ స్కాల్ప్ ను హైడ్రేట్ చేసి పొడి, చుండ్రు నుంచి కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడం ద్వారా జుట్టు బూడిద రంగులోకి మారడాన్ని కూడా తగ్గిస్తుంది.
జుట్టు రాలడాన్ని నివారించడంలో నువ్వుల నూనె ఎలా సహాయపడుతుంది?
జుట్టు మూలాలకు పోషణ నువ్వుల నూనె జుట్టు మూలాల్లోకి లోతుగా చొచ్చుకుపోయి పోషణను అందిస్తుంది. ఇది మూలాలను బలపరుస్తుంది. చివర్లు చిట్లకుండా వెంట్రుకలు ఊడిపోకుండా నిరోధిస్తుంది. అంతే కాదు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నువ్వుల నూనెతో రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రును కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలడానికి చుండ్రు ప్రధాన కారణం కావచ్చు. నువ్వుల నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చుండ్రును నియంత్రిస్తుంది.
తలకు తేమను అందిస్తుంది. నువ్వుల నూనె స్కాల్ప్‌ను హైడ్రేట్ చేస్తుంది. దాని తేమను కాపాడుతుంది. ఇది నెత్తిమీద పొడి, దురదను తగ్గిస్తుంది. నువ్వుల నూనె జుట్టు సహజంగా నల్లగా ఉండేలా షైన్‌ను అందిస్తుంది. బూడిద రంగు రాకుండా, తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది.
నువ్వుల నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి దీన్ని వేళ్ల సహాయంతో తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. మంచి ఫలితాల కోసం, రాత్రంతా నూనెను అలాగే ఉంచి ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. నువ్వుల నూనెలో మెంతి పొడి, ఉసిరి పొడి లేదా అలోవెరా జెల్ కలిపి హెయిర్ మాస్క్‌ను తయారు చేయండి. దీన్ని తలకు, జుట్టుకు పట్టించి 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. ఇతర నూనెలతో కలపి కూడా వాడవచ్చు. నువ్వుల నూనెను కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ నూనెతో కలపి ఉపయోగించిన సరే మంచి ఫలితాలు ఉంటాయి. దీంతో జుట్టుకు అదనపు పోషణ లభిస్తుంది.