శాస్త్రవేత్తల సంచలన ప్రకటన.. వాతావరణ మార్పులతో కొత్త రోగాలు..?

ప్రపంచ దేశాల ప్రజలను ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కొత్త వ్యాధులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, కార్బన్ డై యాక్సైడ్ స్థాయిలు పెరగడం, కార్చిచ్చుల వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల వల్లే అకాల వర్షాలతో పాటు వర్షాకాలంలో సైతం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తలు వాతావరణంలో చోటు చేసుకుంటున్న […]

Written By: Navya, Updated On : November 9, 2020 9:55 am
Follow us on


ప్రపంచ దేశాల ప్రజలను ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కొత్త వ్యాధులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, కార్బన్ డై యాక్సైడ్ స్థాయిలు పెరగడం, కార్చిచ్చుల వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల వల్లే అకాల వర్షాలతో పాటు వర్షాకాలంలో సైతం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

శాస్త్రవేత్తలు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్లే కొత్త రోగాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయని తెలుపుతున్నారు. రోజురోజుకు ప్రపంచ దేశాల్లో విపరీతంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వాతావరణ మార్పులు కారణమవుతున్నాయి. వాతావరణంలో మార్పులు ఇదే విధంగా కొనసాగితే మరిన్ని క్యాన్సర్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ దేశాల్లో మరణాల సంఖ్య కూడా భారీగా పెరగనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు వాతావరణంలోని మార్పులను తగ్గించడానికి ప్రయత్నం చేయాలని లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు గుండె సంబంధిత వ్యాధులతో పాటు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయని చెబుతున్నారు.

2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల కంటే ఎక్కువ మంది క్యాన్సర్ వల్ల చనిపోవచ్చని.. ప్రస్తుత పరిస్థితుల్లో కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే వాతావరణంలోని మార్పులను ఆపడం సాధ్యమవుతుందని తెలుపుతున్నారు.