https://oktelugu.com/

మహిళలకు తక్కువగా కరోనా సోకడానికి కారణం ఇదే..?

భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కోటికి పైగా కరోనా కేసులు నమోదు కాగా నమోదైన కేసుల్లో పురుషుల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడితే మహిళలు మాత్రం తక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు వైరస్ పై అధ్యయనం చేసి మహిళలకు తక్కువగా కరోనా సోకడానికి గల కారణాలను వెల్లడించారు. Also Read: అలాంటి మాస్కులు చాలా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2020 / 12:12 PM IST
    Follow us on


    భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కోటికి పైగా కరోనా కేసులు నమోదు కాగా నమోదైన కేసుల్లో పురుషుల్లో ఎక్కువ మంది వైరస్ బారిన పడితే మహిళలు మాత్రం తక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు వైరస్ పై అధ్యయనం చేసి మహిళలకు తక్కువగా కరోనా సోకడానికి గల కారణాలను వెల్లడించారు.

    Also Read: అలాంటి మాస్కులు చాలా డేంజర్.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..?

    కెనడా శాస్త్రవేత్తలు తాజాగా చేసిన అధ్యయనంలో లైంగిక హార్మోన్లు, క్రోమోజోన్లు పురుషులతో పోల్చి చూస్తే మహిళల్లో ఎక్కువగా ఉంటాయని ఈ హార్మోన్లు, క్రోమోజోన్ల వల్లే మహిళలు తక్కువగా కరోనా బారిన పడుతున్నారని తేల్చారు. కెనడాకు చెందిన యూని‌వ‌ర్సిటీ ఆఫ్‌ ఆల్బర్టా శాస్త్ర‌వే‌త్తలు లైంగిక హార్మోన్లు, క్రోమోజోన్ల వల్ల కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్ మహిళలకు పెరుగుతుందని ఏస్ 2 అనే ఒక ఎంజైమ్ మహిళలు తక్కువగా కరోనా బారిన పడటానికి కారణమవుతోందని తెలిపారు.

    Also Read: కరోనా వైరస్ ను గుర్తించే కొత్త యాప్.. ఎలా పని చేస్తుందంటే..?

    శరీరంలో ఏస్ 2 అనే ఎంజైమ్ వల్ల గుండె, కిడ్నీ, లంగ్స్ సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయి. అయితే ఏస్ 2 అనే ఎంజైమ్ కు సంబంధించిన క్రోమోజోమ్ లు మహిళల్లో 2 ఉండగా పురుషుల్లో మాత్రం ఒకటే ఉంటాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో క్రోమోజోమ్ ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల పురుషులు ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ ఎంజైమ్ కరోనా కట్టడికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికమేనని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని సూచిస్తున్నారు.