https://oktelugu.com/

Scientific Facts: మనిషి చనిపోయే ముందు సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసా?

Scientific Facts: సాధారణంగా ఒక మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు మరణం ముందు తల వంచాల్సిందే. పుట్టిన వాడు గిట్టక మానదు. ఈ క్రమంలోనే మన మరణం ఎప్పుడు వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు. మన ఆయుష్షు ఉన్నంతవరకు మనం జీవిస్తాను.అయితే కొందరికి 50 సంవత్సరాలు ఆయుష్షు ఉన్నప్పటికీ వారు 25 సంవత్సరాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి ఆత్మలు పూర్తిగా ఈ లోకం విడిచి వెళ్ళమని వారి ఆయుష్షు పూర్తయ్యేవరకు ఇక్కడే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2021 12:36 pm
    Follow us on

    Scientific Facts: సాధారణంగా ఒక మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు మరణం ముందు తల వంచాల్సిందే. పుట్టిన వాడు గిట్టక మానదు. ఈ క్రమంలోనే మన మరణం ఎప్పుడు వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు. మన ఆయుష్షు ఉన్నంతవరకు మనం జీవిస్తాను.అయితే కొందరికి 50 సంవత్సరాలు ఆయుష్షు ఉన్నప్పటికీ వారు 25 సంవత్సరాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి ఆత్మలు పూర్తిగా ఈ లోకం విడిచి వెళ్ళమని వారి ఆయుష్షు పూర్తయ్యేవరకు ఇక్కడే తిరుగుతుంటాయని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు.

    ఇవి కూడా చదవండి : అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇల్లరికం వెళ్లాల్సిందే.. ఏ గ్రామంలో అంటే?

    ఇక ఒక మనిషి చనిపోతున్నారనే విషయం ముందుగా వారికి తెలుస్తుందని ఈ క్రమంలోనే వారికి కొన్ని సంకేతాలు అందుతాయని పలువురు పండితులు చెబుతున్నారు. అయితే మనిషి చనిపోయే ముందు వారికి ఎలాంటి సంకేతాలు అందుతాయి అనే విషయానికి వస్తే ఎవరైనా ఒక రెండు మూడు రోజుల్లో చనిపోతున్నారని తెలిసినప్పుడు వారికి కలలో యమకింకరులు కనిపించడం, లేకపోతే ఇంటి గోడలపై యమకింకరులు రూపం కనిపించడం జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

    అదేవిధంగా మన ఇంట్లో ఎవరికైనా మరణం సంభవిస్తుంది అంటే వారి మాటలు కూడా ఎంతో భిన్నంగా ఉంటాయని, వారి ఎవరితోనైనా గొడవ పడటం లేదా వారికి ఎవరినైనా చూడాలనిపిస్తే నాకు టైం దగ్గర పడింది. వారిని రమ్మని చెప్పండి అంటూ పిలిపించుకోవడం చేస్తుంటారు.అలాగే చుట్టుపక్కల వారితో తెలుసో తెలియక మాట్లాడిన మాటలకు బాధపడాల్సిన పని లేదంటూ చెబుతూ మరణిస్తూ ఉంటారు. ఇలా చనిపోయేముందు ప్రతి ఒక్కరికి సంకేతాలు వస్తాయని అందుకు అనుగుణంగానే మాటలు కూడా మాట్లాడుతారని అయితే వారి బ్రతికున్నప్పుడు కాకుండా వారి చనిపోయిన తరువాత ఈ విషయాలను గుర్తు చేసుకొని అందుకే వీరు ఇలా మాట్లాడారా అంటూ మనం భావిస్తామని పండితులు తెలియజేస్తున్నారు.

    ఇవి కూడా చదవండి : ChandraBabu Naidu Wedding Card చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం ఎంత తీసుకున్నాడంటే?