https://oktelugu.com/

Aryan Khan: జైలు నుంచి విడుదలైన షారుక్ ఖాన్ కొడుకు … ఆర్యన్ ఖాన్

Aryan Khan: బాలీవుడ్ బాద్ షా  షారూఖ్ ఖాన్ నిరీక్షణ ఎట్టకేలకు నెరవేరింది. డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు… ఆర్యన్‌ ఖాన్‌  జైలు నుంచి విడుదల అయ్యాడు. ముంబై లోని ఆర్థర్‌ రోడ్‌ జైలు నుంచి షారూఖ్‌ ఖాన్‌ తనయుడ ఆర్యన్‌ ఖాన్‌ రిలీజ్‌ అయ్యారు. గత నెలరోజులుగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి పలువురు ప్రముఖ లాయర్లు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నా బెయిల్ మంజూరు కాలేదు.  […]

Written By: , Updated On : October 30, 2021 / 11:44 AM IST
Follow us on

Aryan Khan: బాలీవుడ్ బాద్ షా  షారూఖ్ ఖాన్ నిరీక్షణ ఎట్టకేలకు నెరవేరింది. డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ తనయుడు… ఆర్యన్‌ ఖాన్‌  జైలు నుంచి విడుదల అయ్యాడు. ముంబై లోని ఆర్థర్‌ రోడ్‌ జైలు నుంచి షారూఖ్‌ ఖాన్‌ తనయుడ ఆర్యన్‌ ఖాన్‌ రిలీజ్‌ అయ్యారు. గత నెలరోజులుగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి పలువురు ప్రముఖ లాయర్లు కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నా బెయిల్ మంజూరు కాలేదు.  కానీ ఎట్టకేలకు లాయర్ ముకుల్ రోహత్గీ ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇప్పించాడు.

bollywood star hero sharukh khan son aryan khan released from jail

ఇక ఆర్యన్‌ ఖాన్‌ విడుదల అవుతున్న కారణంగా షారూఖ్‌ ఖాన్‌ కుటుంబం జైలు వద్దకు చేరుకున్నారు. ఆర్యన్ ఖాన్ కు ఆయన కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. కాగా డ్ర‌గ్స్ కేసులో ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. రెండు సార్లు ఆర్య‌న్ ఖాన్ బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రిపినా ఫలించ‌లేదు. ఆర్య‌న్ ఖాన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఇవాళ ఆయ‌న జైలు నుండి విడుద‌ల అయ్యారు.