పొడిగాలిలో ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్!

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పలు దేశంలో వేగంగా, పలు దేశాల్లో తక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కు వాతావరణానికి సంబంధం ఉందా…? అనే ప్రశ్నకు చాలా అధ్యయనాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ శాస్త్రవేత్తలు పొడి గాలి, తక్కువ తేమలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తేల్చారు. Also Read : బంగారం ప్రియులకు శుభవార్త… 5 రూపాయలకే […]

Written By: Kusuma Aggunna, Updated On : August 21, 2020 2:31 pm
Follow us on

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పలు దేశంలో వేగంగా, పలు దేశాల్లో తక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కు వాతావరణానికి సంబంధం ఉందా…? అనే ప్రశ్నకు చాలా అధ్యయనాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ శాస్త్రవేత్తలు పొడి గాలి, తక్కువ తేమలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని తేల్చారు.

Also Read : బంగారం ప్రియులకు శుభవార్త… 5 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం…?

ఎమర్జింగ్ డిసీజెస్ జర్నల్‌లో తాజాగా ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. అధ్యయన పరిశోధకుడు మైఖేల్ వార్డ్ కరోనా వైరస్ వ్యాప్తికి తేమ ఒక ముఖ్య కారకం అని చెప్పారు. గాలిలో సాపేక్ష ఆర్ధ్రత 10 శాతం కంటే తగ్గితే వైరస్ సోకే అవకాశాలు రెండు రెట్లు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రదేశం, సమయాన్ని బట్టి కరోనా వైరస్ వ్యాప్తిలో తేడాలు ఉంటాయని తేల్చారు.

సిడ్నీలో తక్కువ తేమ శాతం ఉన్న ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగినట్లు గుర్తించామని అన్నారు. తక్కువ తేమ ఉన్న సమయంలో పొడి గాలి ఉంటుందని… తక్కువ తేమలో తుంపరలు చిన్నగా ఉండటం వల్ల తుంపరలు ఎక్కువ సమయం గాలిలో ఉండగలవని శాస్త్రవేత్తలు తేల్చారు. కరోనా రోగి దగ్గినా లేదా తుమ్మినా గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటే వైరస్ ఉండే తుంపరలు ఇతరులు పీల్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. తేమ ఎక్కువగా ఉంటే తుంపరలు పెద్దవిగా ఉండి గాలిలో పడిపోతాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోవడం, భౌతికదూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని శాస్త్రవేత్తలు తేల్చారు.

Also Read : ఇంట్లో ఏ చెట్లు ఉండకూడదో తెలుసా?