Hair : అవాంఛిత రోమాలకు సులభంగా గుడ్ బాయ్ చెప్పండి..

ఎంతో అందమైన మొహం మీద వెంట్రుకలు చాలా మందికి ఉంటాయి. ఇలా ఉంటే చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే వీటిని రిమోవ్ చేయడానికి షేవింగ్, వ్యాక్సింగ్ లేదా హెయిర్ రిమూవల్ క్రీములు వంటి ఎన్నో పద్దతులను ఫాలో అవుతుంటారు. కానీ ఇవేవీ పూర్తి సౌకర్యవంతంగా ఉండవు కదా. వీటివల్ల కొన్నిసైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. మరి మీరు ఇవేవీ వాడకుండా చాలా సులువుగా ఉండే వస్తువులతో ముఖంపై వెంట్రుకలను తొలగించుకోవచ్చు. వీటివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ముఖంపై ఉండే జుట్టు పెరుగుదలను తగ్గించడానికి, వాటిని పూర్తిగా తొలగించడానికి సహాయపడే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : November 6, 2024 11:43 am

Say good boy to unwanted hair with ease..

Follow us on

Hair : పసుపు: పసుపు ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగిస్తుంది. దీనిలో ఉండే శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల పసుపును ఎన్నో చికిత్సల్లో వాడుతుంటారు. ముఖంపై ఉన్న వెంట్రుకలు పోవడానికి కూడా ఈ పసుపును ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు పసుపులో నీళ్లు లేదా పాలు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. దీన్ని వెంట్రుకు ఉన్న ప్రాంతంలో పెట్టి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

చక్కెర నిమ్మరసం: చక్కెర, నిమ్మరసం కూడా ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగిస్తుంది. ఇందుకోసం నిమ్మరసంలో పంచదారను కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయండి. దీన్ని మీ ముఖంపై వృత్తాకార మార్గంలో సున్నితంగా రుద్దుతూ ఉండాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇది మీ ముఖంపై ఉన్న అవాంచిత రోమాలను తొలగిస్తుంది. అంతేకాదు మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది. దీంతో మీ ముఖ చర్మం మృదువుగా మారుతుంది. గ్లో ఇస్తుంది.

తేనె: తేనెలో ఉండే లక్షణాలు మీ ముఖంపై ఉన్న జుట్టు పెరగకుండా ఆపుతాయి. నిమ్మరసంలో తేనెను మిక్స్ చేసి అవాంఛిత రోమాలపై అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ముఖంపై అవాంఛిత రోమాలు రాకుండా ఆపడానికి కూడా తోడ్పడుతుంది తేనె.

బొప్పాయి: బొప్పాయి కూడా ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగిస్తుంది. బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ జుట్టు కుదుళ్లను విచ్ఛిన్నం చేస్తుంది. అంటే వెంట్రుకలు పెరగకుండా సహాయపడుతుంది. ఇందుకోసం బాగా పండిని బొప్పాయి గుజ్జును తీసుకొండి. ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న చోట పెట్టండి. ఇలా ఓ 15 ని.లు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. మీరు బొప్పాయిని రెగ్యులర్ గా ఉపయోగిస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి.

వోట్ మీల్: ఓట్ మీల్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్ మీల్ మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అలాగే చనిపోయిన చర్మ కణాలను కూడా సులువుగా తొలగిస్తుంది. దీనిని వాడటం వల్ల ముఖంపై వెంట్రుకలు తక్కువగా పెరుగుతాయి. అయితే ఓట్స్ లో తేనె, నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పెట్టాలి. ఆ తర్వాత కొద్దిసేపు మసాజ్ చేయండి. ఈ ఓట్స్ మీ చర్మాన్ని మృదువుగా, వెంట్రుకలు పెరగకుండా చేయడానికి సహాయపడుతుంది.