మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటనే సంగతి తెలిసిందే. కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయడంతో పాటు శరీరంలోని మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో సహాయపడతాయి. కిడ్నీల పనితీరు బాగుంటే మాత్రమే ఇతర అవయవాల పనితీరు బాగుంటుంది. కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీలు చెడిపోతే జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది.
Also Read: వాల్ నట్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా..?
కిడ్నీ సమస్యలు వస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. ఎవరైతే షుగర్ సమస్యతో బాధ పడతారో వారికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ బారిన పడకుండా మరియు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకుని మనల్ని మనం రక్షించుకోవచ్చు.
Also Read: కుండలోని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
ఊబకాయంతో బాధ పడేవాళ్లు కూడా కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. మంచి ఆహారం తీసుకుంటూ శరీర బరువును అదుపులో ఉంచుకుంటే ఊబకాయం బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సిగరెట్, మద్యం లాంటి అలవాట్లు ఉంటే ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
రక్తపోటుతో బాధ పడుతున్నా కిడ్నీ సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. నీళ్లు తక్కువగా తాగినా కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల నుంచి 10 గ్లాసుల నీళ్ల తాగితే మంచిది. మోతాదుకు మించి మందులు వాడినా కిడ్నీల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే కిడ్నీ సమస్యలు ఉన్నా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.