యువ హీరో సందీప్ కిషన్ – లావణ్య త్రిపాఠి జంటా డెన్నిస్ జీవన్ తెరకెక్కించిన మూవీ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. ఈ శుక్రవారం పోటీలో రిలీజైందీ మూవీ. తమిళంలో వచ్చిన ‘నాప్టే తునై’కి ఇది రీమేక్. అయితే.. పేరుకు రీమేకే అయినా.. దాదాపు 50 శాతానికి పైగా మార్పులు చేశారు. అంతేకాదు.. ఒరిజినల్ ను కూడా డెన్నిస్ జీవనే తెరకెక్కించడం విశేషం.
Also Read: కలెక్షన్ల ‘ఉప్పెన’.. 100 కోట్ల పోస్టర్ వదిలారుగా!
చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సందీప్.. హాకీ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. ఈ మూవీకి మొదటి రోజు పాజిటివ్ టాకే వచ్చింది. రివ్యూలు కూడా ఓకే అని చెప్పేశాయి. దీంతో.. వీకెండ్ ముగిసే నాటికి లెక్షన్లు పెరుగుతాయని ఆశిస్తోంది యూనిట్.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.4.6 కోట్లు జరిగింది. దీంతో 4.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగాడు సందీప్. అయితే.. ఈ యంగ్ హీరో గత చిత్రాలతో పోలిస్తే.. ఈ అమౌంట్ పెద్దే. అయినప్పటికీ.. రీచ్ అవుతామని ఆశాభావం వ్యక్తంచేస్తోంది యూనిట్. తొలి రోజు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 1.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 79 లక్షల షేర్ రాబట్టింది.
Also Read: స్టార్ రేంజ్ లో డిమాండ్.. అయినా అవమానాలే.. పాపం !
ఏరియాల వారీగా చూసుకుంటే.. నైజాంలోనే ఈ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. నైజాంలో 24 లక్షలు, ఉత్తరాంధ్రలో 10 లక్లు, సీడెడ్ 8 లక్షలు, ఈస్ట్ 8 లక్షలు, వెస్ట్ 5.8 లక్షలు, గుంటూరు 7.2 లక్సలు, కృష్ణాలో 7.1 లక్ష, నెల్లూరులో 5.5 లక్షలు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి గ్రాస్ 1.30 కోట్లు రాగా.. 76 లక్షల షేర్ వచ్చింది.
సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి.. ముందు సండే కూడా ఉంది కాబట్టి.. కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉందని నమ్ముతోంది యూనిట్. ఆ విధంగా సందీప్ ఆశలన్నీ ఆదివారం మీదే పెట్టుకున్నాడని కూడా చెప్పొచ్చు. సినిమా నిర్మాతల్లో హీరో సందీప్ కూడా ఒకరు కావడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. మరి, ఏం జరుగుతుంది? ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పికప్ అందుకొని సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తుందా? ప్యాసింజర్ లాగే ప్రయాణిస్తుందా? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్