https://oktelugu.com/

Rubella : ప్రెగ్నెన్సిలో రుబెల్లా వస్తే? పుట్టే బిడ్డకు సమస్యలు తప్పవు!

గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయిన కొందరికి రుబెల్లా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది పెద్దవాళ్లలో కంటే చిన్నపిల్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. తల్లులకు ఉండటం వల్లే పిల్లలకు సోకుతుందని చాలా భావిస్తారు. అయితే ఇది నిజమేనని వైద్యులు చెబుతున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 13, 2024 / 04:07 AM IST

    Rubella

    Follow us on

    Rubella : ప్రెగ్నెన్సీలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక సమస్య వస్తుంది. గర్భం దాల్చినప్పుడు కొంతమందికి ఎక్కువగా ఇన్ఫెక్షన్‌లు వస్తాయి. అందులో ముఖ్యంగా వర్షాకాలం అయితే చెప్పక్కర్లేదు. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ ఇలా చెప్పుకుంటే ఎన్నో వస్తాయి. గర్భిణిగా ఉన్నప్పటి నుంచి డెలివరీ తర్వాత బిడ్డకు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇలాంటి సమయంలో కొంతమందికి రుబెల్లా వస్తుంది. దీనిని జర్మన్ మీజిల్స్ అని అంటారు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలో కనిపిస్తుంది. కానీ కొంతమందిలో గర్భం దాల్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ బాగా కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకితే దీనివల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదమే. దీనిని వెంటనే గుర్తించి డాక్టర్‌ను సంప్రదించాలి.

    గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయిన కొందరికి రుబెల్లా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది పెద్దవాళ్లలో కంటే చిన్నపిల్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. తల్లులకు ఉండటం వల్లే పిల్లలకు సోకుతుందని చాలా భావిస్తారు. అయితే ఇది నిజమేనని వైద్యులు చెబుతున్నారు. గర్భిణిగా ఉన్న రుబెల్లా ఉంటే.. పుట్టే పిల్లలకు తప్పకుండా ఈ ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రుబెల్లా ఉన్న వ్యక్తితో గర్భిణులు మాట్లాడిన, దగ్గినా, తుమ్మినా గాలి ద్వారా రుబెల్లా వ్యాప్తి చెందుతుంది. ఇలా గర్భిణులకు రుబెల్లా ఇన్ఫెక్షన్ సోకుతుంది. అయితే గర్భిణులకు రుబెల్లా సోకితే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స చేయాలి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన మూడు నెలల్లోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న లక్షణం కనిపించిన లేటు చేయకుండా వైద్యుల సాయంతో చికిత్స తీసుకోవాలి.

    రుబెల్లా మొదటి తేలికపాటి జ్వరం వస్తుంది. ఇలా జ్వరంతో ప్రారంభమై తలనొప్పి, ముఖంపై దద్దుర్లు, దగ్గు, జలుబు, కళ్లు ఎర్రగా మారడం, చెవి ఇన్ఫెక్షన్లు, మొదడు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి రుబెల్లా పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే గర్భిణుల మొదటి మూడునెలల్లోనే పిల్లలో లోపాలు కనిపిస్తాయి. పుట్టిన బిడ్డ మధుమేహం, కంటిశుక్లం, కాలేయం దెబ్బతినడం, థైరాయిడ్, గుండె సమస్యలు, వినికిడి లోపం వంటి సమస్యలతో పుడతారు. కొన్నిసార్లు అవయవలోపంతో పుట్టవచ్చు లేదా గర్భస్రావం కూడా జరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బిడ్డ పుట్టిన ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడి కొన్ని రోజులకు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ లక్షణాలేవి కనిపించవు. దీంతో రుబెల్లాను గుర్తించలేకపోవచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందు లేదా కన్ఫామ్ అయిన తర్వాత రుబెల్లా టెస్ట్ చేసుకోవాలి. పాజిటివ్ వస్తేనే మందులు వాడి, టీకా వేయించుకోవాలి. ఈ టీకా వేయించుకున్న నెల రోజుల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నెగిటివ్ వచ్చిన టీకా వేయించుకుంటే ఇది ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్య వస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే పుట్టే బిడ్డకు సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.