Figs: అంజీర అనగానే వావ్ స్వీట్ ఫ్రూట్ అన్నారా? ఎన్నో రోజుల నుంచి శతాబ్దాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనిలో తీపితో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ అంజీర పండ్లు శరీరానికి చాలా ఉపయోగపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి. అంతేకాదు అనేక వ్యాధులతో పోరాడడంలో మీకు సహాయం చేస్తాయి ఈ పండ్లు. కానీ అత్తి పండ్లను అధికంగా తీసుకోవడం లేదా కొన్ని పరిస్థితులలో వాటిని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఓ సారి తెలుసుకోండి.
అంజీర పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంజీర. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అంతేకాదు ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో బరువు కూడా తగ్గవచ్చు.
అత్తి పండ్లు అదే ఈ అంజీర పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాల్షియం , మినరల్స్ పుష్కలంగా ఉన్న అంజీర ఎముకలను బలోపేతం చేసి మీ శరీర పటుత్వానికి తోడ్పడుతాయి. అయితే కొందరికి అంజీర్ పండ్ల వల్ల ఎలర్జీ వస్తుందట. దద్దుర్లు, వాపు, దురద శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలుగుతాయి. అత్తి పండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ తినాలి అంటున్నారు నిపుణులు.
ఈ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్తి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత అత్తి పండ్లను తీసుకోవద్దు. లేదంటే కొందరికి కడుపులో రక్తస్రావం అవుతుంది అంటున్నారు. అందుకే ఈ పండ్లు తినాలంటే వైద్యులను సంప్రదించాలి.
అంజీర పండ్లకు అలర్జీ వస్తే మాత్రం వీటి జోలికి వెళ్లవద్దు. మధుమేహం ఉంటే మాత్రం ఈ అత్తి పండ్లను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. వైద్యుల సలహాను పాటించడం ఉత్తమం. కిడ్నీ రోగులు వైద్యులను సంప్రదించిన తర్వాతే అంజీర పండ్లను తీసుకోవాలి. చికిత్స తర్వాత ఈ పండ్లను తినాలా వద్దా అనేది ఒకసారి మీ వైద్యులను సంప్రదించండి.
ఇక ప్రయోజనాలు ఎక్కువే కాబట్టి ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిందని డైటీషియన్లు, వైద్యులు చెబుతుంటారు.. చిన్న పిల్లలు మొదలు.. వృద్ధుల వరకు అందరూ ఈ పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇవి తినడం ద్వార అనేక రోగాల బారిన పడకుండ తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఎంతోమంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు అంజీర పండ్లను రోజుకు ఒకటి, రెండు పండ్ల చొప్పున తిన్నా మంచి ఫలితం ఉంటుంది.