https://oktelugu.com/

Salt: అందులో ఉప్పు తగ్గిస్తే.. 6000 కోట్లు ఆదా చేయొచ్చు.. మూడు లక్షల మంది ప్రాణాలు కాపాడొచ్చు..

ఉప్పు.. పేరుకు రెండు అక్షరాలు మాత్రమే.. కానీ అది కలిగించే ముప్పు మామూలుది కాదు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉప్పు పరిమితిపై నిబంధన విధించింది. దానికి సంబంధించి అనేక మార్గదర్శకాలు కూడా రూపొందించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 3, 2024 / 10:17 AM IST

    Salt

    Follow us on

    Salt: కూరల్లో రుచికోసం చాలామంది ఉప్పును ఇష్టానుసారంగా వాడుతుంటారు. కానీ అది మనిషి ఆరోగ్యానికి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ప్రస్తుతం గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.. ఇలాంటి క్రమంలో ఒక మనిషి రోజుకు ఐదు గ్రాముల (రెండు గ్రాముల సోడియం) కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఆహారాలలో సోడియం విపరీతంగా ఉంటున్నది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే సోడియం వినియోగాన్ని తగ్గించాలని.. దానికి సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా భారత్ ఇటీవల రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం మనదేశంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గించాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సోడియం వినియోగాన్ని తగ్గిస్తే వచ్చే పది సంవత్సరాలలో మూడు లక్షల వరకు మహిళలను తగ్గించవచ్చు. 17 లక్షల గుండె జబ్బులను నివారించవచ్చు. ఏడు లక్షల మూత్రపిండాల జబ్బులను నియంత్రించవచ్చు. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం ప్రజలు వెచ్చించే సుమారు 6, 730 కోట్ల నగదును ఆదా చేయవచ్చు.

    ఇష్టానుసారంగా వినియోగం

    ప్యాకేజ్డ్ ఆహారాలు తీసుకోవడం ఇటీవల పెరిగిపోయింది. పాశ్చాత్య సంస్కృతికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కూడా ఇటీవల ఎక్కువైపోయింది. అయితే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలలో విపరీతంగా ఉప్పును వాడతారు. అది శరీరానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఉప్పు వల్ల గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది. మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. ఒక్కోసారి మూత్రపిండాల వైఫల్యం కూడా సంభవించవచ్చు. అది కాలేయం పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందువల్లే సోడియం వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు తయారు చేసే సంస్థలు ఉప్పు వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని వివరిస్తున్నది.. ఉప్పు వినియోగం పెరిగిపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గుండెపోటు కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇక మూత్రపిండాల వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందువల్లే ఉప్పు పరిమితికి మించి తక్కువగా వాడాలని.. అప్పుడే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలలో రుచికోసం ఉప్పును విపరీతంగా వాడుతున్నారు. ఇది అప్పటివరకు నాలుకకు తాత్కాలికంగా మెరుగైన రుచిని చ్చినప్పటికీ.. ఆ తర్వాత అది శరీరంపై దుష్ప్రభావం చూపిస్తోంది. అందువల్లే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు.. అందులో ఎంత శాతం ఉప్పు వాడారో తెలుసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

    నోట్: ఈ కథనం కోసం సమాచారాన్ని వేరు వేరు మార్గాల ద్వారా ఓకే తెలుగు పాఠకులకు అందించేందుకు సేకరించాం. ఇది వైద్యుల సలహాలు, సూచనలకు ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు.