కాలం మారే కొద్దీ మనల్ని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అయితే అనేక ఆరోగ్య సమస్యలకు మన జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లే కారణమని చాలామంది గుర్తించరు. నిజానికి మన వంటింట్లోని పదార్థాలతోనే అనేక ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూర్చే వాటిలో పసుపు టీ కూడా ఒకటి. కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశ ప్రజలు వంటల్లో పసుపును వినియోగిస్తున్నారు.
ఇమ్యూనిటీని పెంచడంలో పసుపు ఎంతగానో సహాయపడుతుంది. అనేక రోగాల బారిన పడకుండా పసుపు మనల్ని రక్షిస్తుంది. పసుపులో ఉండే కుర్కమిన్ అనేక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. అయితే పసుపును టీ రూపంలో తీసుకుంటే మంచిది. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధ పడేవాళ్లు పసుపును టీ రూపంలో తీసుకుంటే సులభంగా ఆ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షించడంలో పసుపు సహాయపడుతుంది. ఇతర కాలాలతో చలికాలంలో వైరస్, బ్యాక్టీరియా అనేక రోగాల బారిన పడటానికి కారణమవుతూ ఉంటాయి. అందువల్ల ఈ కాలంలో రోజుకు కనీసం ఒకసారైనా పసుపు టీ తీసుకుంటే మంచిది. ఒక కప్పు నీటికి అర స్పూన్ పసుపు పొడిని తీసుకోవాలి.
నీటిలో పసుపు పొడిని కలిపిన మిశ్రమాన్ని తీసుకుని ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి. అలా వేడి చేసిన మిశ్రమాన్ని చల్లార్చి అల్లం, తేనె కలిపి టీ తయారు చేసుకోవచ్చు. రోజూ ఈ టీని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు సైతం తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డయాబెటిస్ అడ్డుకోవడంలో సైతం పసుపు ఉపయోగపడుతుందని.. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.