kidney diseases : మనుషుల జీవితం ప్రకృతితో మమేకమై ఉంటుంది. ప్రకృతిలో లభించే చల్లని గాలి, సూర్యరశ్మి లాంటి వనరులు లేకపోతే మనిషి జీవితం ఉండదనే చెప్పాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి స్వచ్ఛమైన గాలి కావాలి. ఈ గాలిని చెట్లు మాత్రమే ఇస్తాయి. అందుకే చెట్లు నాటాలని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. కొన్ని చెట్లు ప్రశాంతమైన వాతావరణం అందిస్తే మరికొన్ని మొక్కలు ఔషధాన్ని అందిస్తాయి. పూర్వ కాలంలో వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. దీంతో కొందరు ఆరోగ్య నిపుణుల కొన్ని చెట్ల ద్వారానే తమ రోగాలను నయం చేసుకున్నారు. వీరిని ఫాలో అవుతూ వచ్చిన కొందరు ఇప్పటికీ చెట్ల ద్వారానే వైద్యం చేస్తున్నారు. అయితే వీటితో ఓ చెట్టు ఆకు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చెట్టు ఆకును రోజుకు రెండు సార్లు నమలడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. అలాగే మరికొన్ని వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధంగా పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ చెట్టు ఏది?
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు వారు నివసించే వాతావరణాన్ని బట్టి ఆరోగ్యం చెడిపోతుంది. మరికొందరు కొన్ని వ్యసనాలకు అలవాటు పడడం వల్ల కొత్తరకమైన వ్యాధులు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నారు. శరీరంలో నీటి శాతం తక్కువ అయినప్పుడు ఆ ప్రభావం ముందుగా కిడ్నీలపై పడుతుంది. దీంతో మూత్ర సమస్యలు వస్తాయి. ఇది అలాగే కొనాసాగితో కిడ్నీలు తీసేసే అవసరం కూడా రావొచ్చు. అందువల్ల దీనిని కిడ్నీ సంబంధిత వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి.
ఈ వ్యాధులకు చికిత్సతో పాటు ఓ చెట్టు ఆకులు ఔషధంగా పనిచేస్తుంది. అదే రణపాల ఆకు. ఈ చెట్టు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో పూల కుండీలో పెంచుకుంటున్నారు. రణ పాల ఆకు వల్ల మూత్ర సమస్యల నుంచి బయటపడొచ్చు. దీనిని ఉదయం, సాయంత్రం రెండు పూటలు తీసుకోవాలి. ఇందులో క్రియాటిన్ లెవెల్స్ ను తగ్గించే గుణాలు ఉంటాయి. రోజుకు రెండు సార్లు తినడం వల్ల డయాలసిస్ రోగులకు మేలు కలుగుతుంది. ఈ ఆకును నేరుగా తినడం వల్ల చేదు, వగరు ఉంటుంది. అయితే దీనిని కషాయంగా చేసుకొని 30 మిల్లి లీటర్ల వరకు తీసుకోవాలి. ఈ ఆకుల్లో యాంటీ ఫైరెటిక్ లక్షణాలు ఉంటాయి. దీంతో జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది.
మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులూ దీనిని తీసుకోవచ్చు. దీనిని తినడం అలవాటు చేసుకుంటే ముందే ఆ వ్యాధి రాకుండా ఉంటుంది. అలాగే అల్సర్లు, జలుబు, మలబద్ధకం వంటి సమస్యలకు రణపాల ఆకు చెక్ పెడుతుంది. హైబీపీతోబాధపడే వారు సైతం ఈ ఆకును నేరుగా తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. అయితే తలనొప్పి ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ ఆకును నేరుగా తీసుకోవడానికి ఇబ్బంది పడితే దీనిని పేస్టుగా చేసుకొని తలపై ఉంచాలి. ఇలా పెట్టినా తలనొప్పి వెంటనే మటుమాయం అవుతుంది.