Mutual Funds : 10 సంవత్సరాల్లో 25.4 శాతం రిటర్న్స్.. ఈ ఇన్వెస్ట్ మెంట్ గురించి తెలుసా?

డబ్బును లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ పొందాలంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్. అందులోనూ మంచి కంపెనీల్లో పెట్టుబుడులు పెడితే తిరుగుండదు.

Written By: Chai Muchhata, Updated On : August 20, 2024 6:35 pm

Max Life to Industry First Nifty 500 Movement 50 - A flexicap Index fund with returns of 25.4 per cent in 10 years

Follow us on

Mutual Funds : డబ్బు సంపాదించడం కన్నా.. దానిని పొదుపు చేయడంలో ఎక్కువ తెలివి ఉండాలని కొందరు ఆర్థిక నిపుణులు పేర్కొంటారు. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు రెట్టింపు కావాలంటే మంచి పెట్టుబడులు చేయాలి. Mutual Funds అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా మినిమం రిటర్న్ ఉండడంతో పాటు పెట్టుబడులకు సెక్యూరిటీ ఇస్తుండడంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్ లోనూ ఇన్వెస్ట్ మెంట్ చేయాలంటే కాస్త అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి వాటిపై పెట్టుబడులు పెడుతున్నమో తెలుసుకోవాలి. వీటిపై అవగాహన ఉన్న వారు గ్రోత్ కంపెనీల వైపు చూస్తారు. వీటిలో ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల మిగతా వారి కంటే తొందరగా ఎక్కువ రిటర్న్స్ పొందుతుంటారు. తాజాగా ఓ కంపెనీ గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. ఇందులో ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టిన వారికి 10 సంవత్సరాల్లో 25.4 శాతం, 5 ఏళ్లలో 33.9 రిటర్న్స్ వచ్చాయి. ఆ కంపెనీ వివరాల్లోకి వెళితే..

మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. అందరూ దీనివైపు చూస్తున్నారు.. అందువల్ల అందరితో పాటు ఇంకొదరు ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. కానీ ఏ కంపెనీ కోసం పెట్టుబుడులు పెడుతున్నామో అవగాహన ఉంటే మరింత రిటర్న్స్ పొందవచ్చు. కొన్ని కంపెనీలు నిత్యం గ్రోత్ లెవల్లో ఉంటాయి. ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల అత్యధిక లాభాలు పొందుతారు. కొన్ని కంపెనీలు కొత్తగా ఎస్టాబ్లిస్ అవుతాయి.ఇవి గ్రోత్ సాధించవచ్చు. లేకపోవచ్చు. కానీ మూమెంట్ చేసి ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. ఇలాగే ఓ కంపెనీ గురించిఇన్వెస్టర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అదే Max Life.

Max Life నుంచి Industry First Nifty 500 Movement 50 – A flexicap Index అనే ఫండ్ ను స్టార్ట్ చేశారు. దీని NFO బెంచ్ మార్క్ 2014లో ఇన్వెస్ట్ మెంట్ చేసిన వారికి ప్రస్తుతం 25.4 శాతం రిటర్న్స్ వచ్చాయి. అయితే లాస్ట్ 5 ఏళ్లలో మాత్రం 33.9 రిటర్న్స్ వచ్చాయి. దీనిని బట్టి చూస్తే గత పదేళ్లలో ఈ పెట్టుబడులు గ్రోత్ సాధించిందని చెప్పొచ్చు. మ్యాక్స్ లైప్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల ఈ ఫండ్ ను వాళ్లు 500 బెస్ట్ కంపెనీలకు పైగా పెట్టుబడులు పెడుతారు. దీంతో వీటిలో కొన్ని గ్రోత్ సాధించినా మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే ఈ ఇన్వెస్ట్ మెంట్ ఒకేసారి లేదా మంథ్లీ వైజ్ గా ఉంటుంది. నెలనెలా చెల్లించిన వారు ఎక్కువగా రిటర్న్స్ పొందారు. అంతేకాకుండా ఈ ఇన్వెస్ట్ మెంట్ కు టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది.

ఇందులో మినిమం రూ.10 నుంచి రూ. 2000 వరకు పెట్టుబుడుల పెట్టొచ్చు. వీటిలో దేశీయులే కాకుండా విదేశాల్లో ఉన్న వారు సైతం ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు. అయితే ఇందులో పెట్టుబడులు పెట్టేవారు ముందుగా డాక్యమెంట్ ను నిశితంగా పరిశీలించాలి. ఆ తరువాతే ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. డబ్బును లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ పొందాలంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్. అందులోనూ మంచి కంపెనీల్లో పెట్టుబుడులు పెడితే తిరుగుండదు.