పరగడుపున రాగిజావ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

రోజూ ఉదయం సమయంలో రాగిజావ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పరగడుపున రాగిజావ తాగితే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ధాన్యపు గింజలలో ఒకటైన రాగులలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగి సంగటిని తిన్నా రాగులతో తయారు చేసిన అంబలిని తాగినా కూడా ఈ ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన దేశంలో చిరుధాన్యాల ఆహారంలో భాగంగా రాగులను వినియోగించడం జరుగుతోంది. Also Read: గర్భిణీలు […]

Written By: Navya, Updated On : April 1, 2021 10:46 am
Follow us on

రోజూ ఉదయం సమయంలో రాగిజావ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పరగడుపున రాగిజావ తాగితే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ధాన్యపు గింజలలో ఒకటైన రాగులలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగి సంగటిని తిన్నా రాగులతో తయారు చేసిన అంబలిని తాగినా కూడా ఈ ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన దేశంలో చిరుధాన్యాల ఆహారంలో భాగంగా రాగులను వినియోగించడం జరుగుతోంది.

Also Read: గర్భిణీలు కాఫీ తాగితే ఆ ఆరోగ్య సమస్యలు వస్తాయా..?

రాగులలో బీ విటమిన్, ఐరన్ తో పాటు శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు, ఫైబర్, పొటాషియం, కార్బొహేడ్రేట్లు, కాల్షియం ఉన్నాయి. శరీరానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి రాగి జావ తాగితే మంచిది. రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి బలం పెరుగుతుంది. మొలకెత్తిన రాగులను తీసుకున్నా శరీరానికి మంచిదని చెప్పవచ్చు. దేశంలో మధుమేహం రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న రాగులను మధుమేహ రోగులు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. రాగులు రక్తప్రసరణ బాగా జరగడంలో తోడ్పడటంతో పాటు గుండెను రక్షిస్తుంది. మన శరీరం అంటువ్యాధుల బారిన పడకుండా రక్షించడంలో రాగులు తోడ్పడతాయి. రక్తహీనత సమస్యకు రాగులు సులభంగా చెక్ పెడతాయి. రాగులు ఎముకలను దృధంగా ఉంచడంతో పాటు నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

Also Read: గంజి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

రాగులతో తయారు చేసిన పిండిని వేడి నీటిలో కలపడం ద్వారా సులభంగా రాగి జావను తయారు చేసుకోవచ్చు. రాగిజావలో మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకుంటే రాగిజావ ఎంతో రుచిగా ఉంటుంది.