Prospect Cancer: పురుషుల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? వెంటనే వైద్యులను సంప్రదించండి..

ఈ వ్యాధి తొలిదశలో కొంతమంది వృద్ధ పురుషుల్లో కనిపించింది. ఎక్కువసార్లు మూత్రం రావడం, రాత్రి సమయంలో నిద్రలో మూత్ర విసర్జన చేయడం, డ్రాప్స్ గా మూత్రం రావడం, మూత్రంలో రక్తం కనిపపించడం వంటి లక్షణాలు ప్రాస్టేట్ క్యాన్సర్ లో లక్షణాల్లో భాగంగా ఉన్నాయి.

Written By: Chai Muchhata, Updated On : March 29, 2024 3:08 pm

prospect cancer

Follow us on

Prospect Cancer: కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు దరి చేరుతున్నాయి. వాతావరణ కాలుష్యంతో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా మహిళలతో పాటు పురుషుల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల పురుషులు ఎదుర్కొంటున్న వ్యాధుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ (పౌరుష గ్రంథి క్యాన్సర్). ఇది పురుషులతో పాటు వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల ప్రతీ ఏడాది సుమారు 3 శాతం మంది మరణిస్తున్నట్లు ఆరోగ్య సంస్థలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?ఇది ఎలా సంక్రమిస్తుంది? ఆ వివరాల్లోకి వెళితే..

ప్రాస్టేట్ క్యాన్సర్ ను మొదటిసారిగా 1904లో మొదటిసారిగా జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రిలో కనుగొన్నారు. మొదట దీనిని చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. 20 శతాబ్ధంలో ఇది వెలుగులోకి రావడంతో 1941లో చార్లెస్ బి హగ్గిన్స్ టెస్టోస్టిరోను హార్మోన్ కు వ్యతిరేకంగా ఈ స్ట్రోజన్ ను ఉపయోగించి దీని పెరుగుదలను నియంత్రించాడు. ఇందుకోసం ఆయనకు 1966లో నోబెల్ బహుమతిని కూడా పొందాడు. ఆ తరువాత దీనిని వైద్య చికిత్సలో భాగంగా చేర్చారు.

ఈ వ్యాధి తొలిదశలో కొంతమంది వృద్ధ పురుషుల్లో కనిపించింది. ఎక్కువసార్లు మూత్రం రావడం, రాత్రి సమయంలో నిద్రలో మూత్ర విసర్జన చేయడం, డ్రాప్స్ గా మూత్రం రావడం, మూత్రంలో రక్తం కనిపపించడం వంటి లక్షణాలు ప్రాస్టేట్ క్యాన్సర్ లో లక్షణాల్లో భాగంగా ఉన్నాయి. ఇది ఎక్కువగా మూత్ర విసర్జన ప్రదేశంలోనే మూత్ర ద్వారానికి అడ్డుగా పౌరుష గ్రంథి పెరగడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో లైంగిక సంబంధమైన సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ప్రాస్టేట్ క్యాన్సర్ మూత్ర విసర్జన ద్వారా ప్రారంభమై శరీరంలోకి వ్యాపిస్తుంది.

ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిచగానే మలద్వారా స్కానింగ్ చేస్తారు. పూర్తి నిర్దారణ కోసం హిస్టాలజీ ద్వారా సూక్షదర్శినిలో పరీక్షించిన తరువాతే గుర్తిస్తారు. ఈ వ్యాధి చికిత్సకు వద్ధుల్లో చికిత్సకు సహకరించే అవకాశం లేదు. అందువల్ల మెడిసిన్ ద్వారా తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే పొందుతారు. అయితే ఇతరులకు మాత్రం ఇది ఏ స్టేజీలో ఉందో తెలుసుకొని కొన్ని విధానల ద్వారా చికిత్స చేస్తారు. అయితే పైన చెప్పిన లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.