https://oktelugu.com/

Black Spot Banana: నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు విషపూరితమా?

నిజంగానే ఈ మచ్చలు ఉన్న అరటి పండ్లను తినవద్దా? సహజ పోషకాలకు నిలువ అయిన అరటి పండ్లు త్వరగా అరుగుతాయి కూడా. అయితే ఎంత మాగితే అంత మచ్చలు పడతాయట ఈ పండ్ల మీద.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 29, 2024 / 03:05 PM IST

    Black Spot Banana

    Follow us on

    Black Spot Banana: అరటి పండును ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తియ్యగా కాస్త తక్కువ ధరలో లభించే ఈ అరటి పండుకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. మరి ఈ అరటిపండుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు. ఇందులో ఉండే పీచు పదార్థం, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ అరటి పండ్లు ఎన్నో రకాలుగా ఉంటాయట. ఇదిలా ఉంటే పచ్చటి అరటి పండు మీద రవ్వంత నల్లటి మచ్చ ఉంటే తినవద్దు అంటారు. ఇది శరీరానికి హాని చేస్తుంది అని తెలుపుతారు.

    నిజంగానే ఈ మచ్చలు ఉన్న అరటి పండ్లను తినవద్దా? సహజ పోషకాలకు నిలువ అయిన అరటి పండ్లు త్వరగా అరుగుతాయి కూడా. అయితే ఎంత మాగితే అంత మచ్చలు పడతాయట ఈ పండ్ల మీద. అంతేకానీ ఇవి కుళ్లినవి, పనికి రానివి కావు అని తీసిపారేయకండి అంటున్నారు కొందరు. కేవలం ఎక్కువ మాగడం వల్ల మాత్రమే అరటిపండ్లపై మచ్చలు వస్తాయట. అవి హాని కలిగించేవి కావు.

    అరటి పండ్ల మీద ఏర్పడే నల్లని మచ్చలు టీఎన్ఎఫ్ ఫ్యాక్టరీ ని సూచిస్తాయట. అంటే ట్యూమర్ నికోటిన్ ఫ్యాక్టర్ అని చెబుతారు. ఇవి రక్తంలోని క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో తోడ్పడతాయి. అయితే బాగా మక్కిన అరటిపండ్లలో చాలా ఆక్సిడెంట్లు ఉంటాయి అంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయట. అంతేకాదు ఎన్నో రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కూడా అందిస్తాయట.

    అరటి పండ్లు జీర్ణక్రియను వేగవంతం చేస్తూ పేగులను శుద్ది చేయడంలో కూడా సహాయం చేస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6, మెగ్నీషియం, మాంగనీసు, రాగి, బయోటిన్ వంటివి అరటిపండ్లలో పుష్కలంగా దొరుకుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే అరటిపండును తినేసేయండి.