Pregnant women : ప్రస్తుతం గర్భం దాల్చడమే పెద్ద సమస్య. ఈ గర్భం దాల్చిన తర్వాత దానిని కాపాడుకోవడం మరింత పెద్ద సమస్యగా మారుతుంది. కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలంటే చాలా విషయాల పరంగా జాగ్రత్త వహించాల్సిందే. ఆహారం, వాతావరణం వంటి చాలా విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. వాతావరణం గర్భిణీ స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నారా? అయితే ఇక నుంచి వాతావరణ మార్పు ఇకపై కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కూడా పెద్ద ముప్పుగా మారుతోంది. ఇటీవల, క్లైమేట్ సెంట్రల్ విడుదల చేసిన ఒక కొత్త నివేదిక, వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న వేడి, వేడిగాలులు గర్భధారణలో ప్రమాదకరమైన సమస్యలను పెంచుతున్నాయని వెల్లడించింది. అయితే ఈ నివేదిక ప్రకారం చూస్తే 2020 నుంచి 2024 వరకు డేటాను వెల్లడించింది. అందులో 247 దేశాలలో ఉష్ణోగ్రత డేటాను తెలిపింది. 222 దేశాలలో గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరమైన వేడి రోజులు రెట్టింపు అయ్యాయని చూపిస్తుంది.
ఆ నివేదిక ప్రకారం, వేడి కారణంగా, గర్భిణీ స్త్రీలలో అకాల ప్రసవం, మృతశిశు జననం, జనన లోపాలు, గర్భధారణ మధుమేహం ప్రమాదం పెరుగుతోంది. ఈ ప్రమాదం ముఖ్యంగా కరేబియన్, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆరోగ్య సౌకర్యాలు పరిమితం. ఉదాహరణకు, భారతదేశం వంటి దేశాలలో, వేడిలో పనిచేసే గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం అయ్యే ప్రమాదం రెట్టింపు అవుతుంది.
వేడితో పాటు, వాతావరణ మార్పుల వల్ల కలిగే వరదలు, అడవి లో చెలరేగే మంటలు కూడా గర్భిణీ స్త్రీలకు సమస్యలను సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా కలుషితమైన నీరు గర్భిణీ స్త్రీలలో కడుపు వ్యాధులు, అకాల ప్రసవ ప్రమాదాన్ని పెంచుతుంది. అదే సమయంలో, మంటల నుంచి వచ్చే పొగ పిల్లల ఊపిరితిత్తులు, మెదడు అభివృద్ధికి హాని కలిగిస్తుంది.
గర్భిణీ స్త్రీల శరీరాలు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో బలహీనంగా ఉంటాయని దీని వల్ల వారికి వేడి మరింత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. వాతావరణ మార్పుల ప్రమాదాల నుంచి గర్భిణీ స్త్రీలను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక కోరుతోంది. వేడి నుంచి రక్షించడానికి మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, అవగాహన ప్రచారాలు, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం వంటి సూచనలు ఇందులో ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ విషయం గురించి చర్చిస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సమస్య మరింత తీవ్రతరం అవుతుంది అంటున్నారు నిపుణులు.
Also Read : గర్భిణులు వర్క్‌వుట్‌లు చేయవచ్చా? చేస్తే ఏమవుతుంది?