
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3కి చేరింది. రెండు రోజుల క్రితం వింతవ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బరావమ్మ(56), చంద్రరావు(50)ను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. విజయవాడలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. మృతురాలు సుబ్బరావమ్మకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని, మృతుడు చంద్రరావుకు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉందని వైద్యులు వెల్లడించారు. వింత వ్యాధితో బాధపడుతూ ఈనెల 6న శ్రీధర్ (45) మృతి చెందిన విషయం తెలిసిందే.