HomeజాతీయంPooja Oil Adulteration : దేవుడికి వాడే పూజా ఆయిల్ ఇలాంటిదా.. చూస్తే మీరు తట్టుకోలేరు..

Pooja Oil Adulteration : దేవుడికి వాడే పూజా ఆయిల్ ఇలాంటిదా.. చూస్తే మీరు తట్టుకోలేరు..

Pooja Oil Adulteration : ప్రస్తుతం శ్రావణమాసం. ప్రతి ఇళ్లల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఉదయం లేవగానే సుప్రభాత పాటలు.. ధూప, దీపాలు.. అగర్బత్తుల సువాసనలతో ఇల్లు దేవాలయం గా మారుతుంది. అయితే ప్రతి పూజలో దీపం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ దీపానికి వెలిగించే నూనె ఎటువంటిదో చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఈ నూనె తయారీలో ఎంతో మోసం ఉంటుందని కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నూనె తయారీలో […]

Pooja Oil Adulteration : ప్రస్తుతం శ్రావణమాసం. ప్రతి ఇళ్లల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఉదయం లేవగానే సుప్రభాత పాటలు.. ధూప, దీపాలు.. అగర్బత్తుల సువాసనలతో ఇల్లు దేవాలయం గా మారుతుంది. అయితే ప్రతి పూజలో దీపం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ దీపానికి వెలిగించే నూనె ఎటువంటిదో చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఈ నూనె తయారీలో ఎంతో మోసం ఉంటుందని కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నూనె తయారీలో ఎలాంటి స్వచ్ఛత లేకుండా.. పాడైపోయిన నూనెను సరఫరా చేస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అదెలా జరుగుతుందంటే?

ఇటీవల కొన్ని వీడియోల ద్వారా.. కొందరు ప్రముఖులు తెలుపుతున్న ప్రకారం.. హోటల్స్, ఇతర ప్రదేశాల్లో ఉపయోగించి పక్కకు పెట్టే నూనె తిరిగి పూజ ఆయిల్ అని విక్రయిస్తున్నట్లు కొందరు తెలుపుతున్నారు. పాడైపోయిన నూనెను తిరిగి చిన్న చిన్న బాటిల్స్ లో ఉంచి వాటిపై దేవుడికి సంబంధించిన స్టిక్కర్ వేసి మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు అంటున్నారు. అయితే వీటిని తక్కువ ధరకే విక్రయించడంతో చాలామంది రెడీమేడ్ గా దొరికే నూనె అని భావించి పూజ కోసం తీసుకెళ్తున్నారు. కానీ ఇవి పూర్తిగా కల్తీ మయంగా మారుతుందని కొందరు ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి దేవుడి దగ్గర దీపం వెలిగించేవారు స్వచ్ఛమైన మనసుతో.. స్వచ్ఛమైన పదార్థాలను ఉపయోగించాలి. ఇందులో నూనె విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పూర్వకాలంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించేవారు. ఈ నెయ్యిని ఉపయోగించడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఎలా ఉంటుంది. అంతేకాకుండా సువాసనలను వెదజల్లుతుంది. అందువల్ల దేవుడికి దీపం వెలిగించే విషయంలో ఎటువంటి నూనెను వాడుతున్నాం అనే విషయాన్ని గ్రహించుకోవాలి.

అంతేకాకుండా న్యాచురల్ గా దొరికే ఆయిల్ ను మాత్రమే తీసుకురావాలి. రెడీమేడ్ గా దొరికే ఈ పూజ ఆయిల్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని కొందరు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ నూనె ను ఉపయోగించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే ఎక్కువ శాతం దీపం వెలిగించేవారు ఆవు నెయ్యిని ఉపయోగించాలని ఆధ్యాత్మికవాదులు సూచిస్తున్నారు. వీటి ద్వారా కాస్త ఎక్కువగానే ఉంటుంది.. కానీ స్వచ్ఛమైన మనసుతో దేవుడిని ప్రార్థించే వారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper