Pesalu Health Benefits: ప్రస్తుత కాలంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. దీంతో కొత్త కొత్త రోగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటినుంచి తట్టుకోవడానికి సాధారణ ఆహారం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ప్రోటీన్లు కలిగిన పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు. పప్పు దినుసుల్లో ప్రత్యేకంగా పెసలు గురించి చెప్పుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతిరోజు డైట్ లో పెసలు తప్పకుండా చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెసర్లలో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి. అలాగే ఈ పెసర్లతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గేందుకు సహాయం:
ప్రస్తుత కాలంలో చాలామంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా మెడిసిన్స్ తీసుకునే బదులు పెసర్లను డైట్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు అవుతుంది. దీంతో ఎక్కువసేపు కడుపు ఇప్పుడు నిండినట్లు భావన కలిగి అనవసరపు ఆహారాన్ని తీసుకునే అలవాటు తగ్గుతుంది. ఫలితంగా ఉబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు:
పెసర్ల వలన గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వీటిలో ఉండే పొటాషియం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో హై బీపీ నీ తగ్గించే అవకాశం ఉంది. ప్రతిరోజు ఆహారంలో పెసర్లను చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు
మొలకలు అయితే మరీ మంచిది:
పెసలు ను నేరుగా తీసుకునేందుకు ఇబ్బంది పడేవారు ఉడకపెట్టి తీసుకోవడం మరీ మంచిది అని అంటున్నారు. సాధారణంగా పెసలులో ఉండే ప్రోటీలకంటే ఉడకపెట్టిన తర్వాత మరింత ఎంజాయ్ తో కూడుకొని ఉంటాయి. ఉడకపెట్టిన మొలకల్లో విటమిన్ సి అత్యధికంగా తయారవుతుంది. దీంతో ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఉడకపెట్టిన తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఉండవు.
అత్యధికంగా ఫైబర్:
పెసలులో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది ప్లస్ పాయింట్ గా మారనుంది. అంతేకాకుండా జీవనక్రియ సమస్యలు ఎదుర్కునే వారు దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి పేగు సమస్యలు లేకుండా ఉండవచ్చు.
ఖనిజాలు ఎక్కువ:
ఎక్కువ ప్రోటీన్లు కావడానికి రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. కానీ వాటికంటే పెసలను ఉడకబెట్టి తీసుకోవడం వల్ల అత్యధికంగా ఖనిజాలను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండడంతో ప్రాసెస్ఫుల్ కంటే ఇది చాలా బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.