Dinner: ఉద్యోగం, వ్యాపారం కారణంగా నేటి కాలంలో చాలామంది బిజీ వాతావరణంలో గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం పై ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం లేదు. అయితే నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి చిన్న చిన్న వ్యాయామాలు అయినా చేయాలి అని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తే ఉదయం వ్యాయామం చేయకున్నా ఎలాంటి సమస్యలు దరిచేరమని అంటున్నారు. అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా వీటిని పాటించాలని అంటున్నారు. అసలు భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి? అలా చేస్తే ఎటువంటి లాభాలు ఉంటాయి?
సాధారణంగా చాలామంది భోజనం చేసిన తర్వాత కాస్త కునుకు తీయాలని అనుకుంటారు. దీంతో వెంటనే బెడ్ ఎక్కేస్తారు. శారీరకంగా శ్రమపడిన వారికి ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. కానీ ఎక్కువగా కూర్చుని పని చేసేవారు మాత్రం భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామంలో భాగంగా కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఇలా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల శరీరంలో జీర్ణ క్రియ చురుగ్గా పనిచేస్తుంది. కడుపులో ఉన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. నడక సమయంలో పేగులకు రక్తప్రసరణ పెరిగి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి డిన్న తర్వాత తేలికపాటి నడక చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత నడిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చుని పోతే గ్లూకోస్ రక్తంలోని నిలిచిపోతుంది. ఇలా ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నడవడం వల్ల ఇన్సూరెన్స్ సెన్సిటివిటీ పెరుగుతుంది. పోస్ట్ డిన్నర్ షుగర్ స్పైక్స్ తగ్గుతాయి. టైప్ టు డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. అందువల్ల రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత కచ్చితంగా నడక ఉండాలి.
అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రించడం కూడా మంచిది కాదు. కనీసం రెండు నుంచి మూడు గంటల విరామం తర్వాత నిద్రపోవడం అవసరం. అలా కాకుండా తిన్న వెంటనే నిద్రిస్తే యాసిడ్ రిప్లెక్స్, హార్ట్ బర్న్ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. రెండు నుంచి మూడు గంటల పాటు భోజనం తర్వాత విరామం ఇస్తే మెటబాలిజం సరైన విధంగా పనిచేస్తుంది.
భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయడం అలవాటు ఉంటే దానిని వెంటనే మానుకోవాలి. భోజనం చేసిన తర్వాత శరీరంలో రక్తప్రసరణ ఎక్కువగా జీర్ణ అవయవాల వైపు ఉంటుంది. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ చర్మం వైపు మల్లుతుంది. దీంతో జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 45 నిమిషాల తర్వాత మాత్రమే స్నానం చేయాలి.