YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు మీడియాను పిలిచి వారం వారం వారాంతపు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో తనకు తగిన సమయం దొరకదని.. అటువంటప్పుడు సభకు వెళ్లి ఏం లాభం అని జగన్ ప్రశ్నిస్తున్నారు. సభకు వెళ్లడం లేదు కాబట్టి మీడియా ముఖ్యంగా నిలదీయాలని ప్రతివారం తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లే క్రమంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతోంది.
* గాంధీజీ వర్ధంతి సందర్భంగా..
మహాత్మా గాంధీ( Mahatma Gandhi) వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన ట్వీట్ చేశారు. జాతిపితకు నివాళులు అర్పించారు. ” సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ వాడదు ” అని చెప్పడమే కాకుండా.. తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా.. ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అంటూ జగన్మోహన్ రెడ్డి ట్రీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. మహాత్మా గాంధీ వర్ధంతిని కూడా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలకు వాడుకున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* కూటమి ప్రభుత్వంపై విసుర్లు
జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఒక వైఖరిని అనుసరిస్తున్నారు. వారంలో మూడు రోజులపాటు తాడేపల్లి లో ఉంటున్నారు. నాలుగు రోజులపాటు బెంగళూరు వెళుతున్నారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతానని చెబుతున్నారు. కానీ ప్రజల మధ్యకు వచ్చేందుకు సంశయిస్తున్నారు. మరోవైపు శాసనసభకు హాజరు కాకుండా ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. నిన్ననే మీడియా ముందుకు వచ్చి జనసేన ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో సత్యం అనేది లేదని.. గత ఐదేళ్లుగా ధర్మం గా పాలించానని.. ఇప్పుడు కూటమి గెలవవచ్చు కానీ.. అంతిమ విజయం తనదేనని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి.
“సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక, తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2026