హైబీపీ ఉన్నవాళ్లు ఈ పండు తింటే చాలు..!

కీరదోసను తీసుకోవడం ద్వారా బీపీ తొందరగా తగ్గిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది. కీరదోసలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తేటతెల్లమైంది. కీరదోసలో 90శాతం నీరే ఉంటుంది. దాంతో పాటు ఖనిజ లవణాలు కూడా చాలా ఎక్కువ. కీరదోసలో పోటాషియం పాళ్లు చాలా ఎక్కువ. హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటే రక్తపోటును నియంత్రిస్తుంది. Also Read: షుగర్ పేషెంట్స్ ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా..? కీరదోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండడంతో అది దేహంలోకి చక్కెరను […]

Written By: NARESH, Updated On : October 24, 2020 5:06 pm
Follow us on

కీరదోసను తీసుకోవడం ద్వారా బీపీ తొందరగా తగ్గిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది. కీరదోసలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తేటతెల్లమైంది. కీరదోసలో 90శాతం నీరే ఉంటుంది. దాంతో పాటు ఖనిజ లవణాలు కూడా చాలా ఎక్కువ. కీరదోసలో పోటాషియం పాళ్లు చాలా ఎక్కువ. హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటే రక్తపోటును నియంత్రిస్తుంది.

Also Read: షుగర్ పేషెంట్స్ ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా..?

కీరదోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండడంతో అది దేహంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. కీరదోసలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను శుభ్ర పరచడంతోపాటు కడుపులో ఎలాంటి గడబిడ లేకుండా ఆకలి బాగా వేయడానికి తోడ్పడుతుంది.

Also Read: బట్టతల బాధితులకు శుభవార్త !

కీరదోసలోని యాంటిబయాటిక్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. కీరదోస మహిళల్లో రొమ్ముక్యాన్సర్లు, పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుంది. కీరదోస శరీరంలో విషయ పదార్థాలను బయటకు పంపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మూత్రపిండాలపై పడే అదనపు భారాన్ని తొలగిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుతుంది. గుండెజబ్బులను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.