https://oktelugu.com/

క్రిష్ మామూలోడు కాదు.. పవన్‌కే షాకిచ్చాడు !

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ కొంచెం డిఫరెంట్. పర్ఫెక్షన్ కోసం తపించే తత్వం ఉన్న డైరెక్టర్. అందుకే ఆయన మేకింగ్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటుంటారు. ‘కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇలా ఆయన సినిమా ఏది చూసినా మేకింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నవే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పంథాకు స్వస్తి చెప్పి శరవేగంగా సినిమాను ముగించారాయన. ప్రస్తుతం క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ సినిమాను తక్కువ రోజుల్లోనే ఫినిష్ చేసేశారు […]

Written By: , Updated On : October 24, 2020 / 04:43 PM IST
Follow us on

Director Krish-Vaishnav Tej movie shooting completed
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ కొంచెం డిఫరెంట్. పర్ఫెక్షన్ కోసం తపించే తత్వం ఉన్న డైరెక్టర్. అందుకే ఆయన మేకింగ్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటుంటారు. ‘కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇలా ఆయన సినిమా ఏది చూసినా మేకింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నవే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పంథాకు స్వస్తి చెప్పి శరవేగంగా సినిమాను ముగించారాయన. ప్రస్తుతం క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ సినిమాను తక్కువ రోజుల్లోనే ఫినిష్ చేసేశారు క్రిష్.

Also Read: గర్జించిన ‘కొమురంభీం’.. రికార్డులన్నీ బద్దలు..!

నిజానికి క్రిష్ పవన్ కళ్యాణ్ హీరోగా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమాను స్టార్ట్ చేశారు. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా అది ఆగిపోయింది. ఇక షూటింగ్స్ మొదలయ్యాక పవన్ చేయాల్సిన ‘వకీల్ సాబ్’ బ్యాలన్స్ ఉండిపోవడంతో క్రిష్ సినిమాకు డేట్లు కేటాయించడం కుదరలేదు. అందుకే కొన్నిరోజులు ఆగమని క్రిష్ కు చెప్పారు పవన్. అయితే క్రిష్ ఈ గ్యాప్లో ఇంకో సినిమా చేస్తానని పవన్‌కు చెప్పి వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా స్టార్ట్ చేశారు. దీంతో అసలే క్రిష్ నెమ్మది.. ఇప్పుడు ఇంకో సినిమా పెట్టుకున్నాడు. అది పూర్తయ్యేదెప్పుడు పవన్ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు అని అభిమానులు అనుకున్నారు.

Also Read: ట్రైలర్ టాక్: కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’గా ఎలా మారిందంటే?

కానీ క్రిష్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొత్త సినిమాను దాదాపు పూర్తి చేసేశారు. కేవలం 35 రోజుల సింగిల్ షెడ్యూల్లో టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేశారు. ఇంకొక్క సాంగ్ మాత్రమే మిగిలుంది. దానికి ఇంకో నాలుగైదు రోజులు తీసుకున్నా వచ్చే వారంలో గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే. అంటే పవన్ ‘వకీల్ సాబ్’ షూట్ కంప్లీట్ చేయకముందే క్రిష్ తన సినిమాను ముగించి పవన్ కోసం ఎదురుచూడనున్నారు. క్రిష్ లోని ఈ స్పీడ్ చూసి పవన్ సైతం ఆశ్చర్యపోయే ఉంటారు. ఇక అభిమానులైతే క్రిష్ ఇంత వేగంగా ఉన్నాడు అంటే పవన్ చిత్రాన్ని కూడ ఫటాఫట్ లాగించేస్తాడని హ్యాపీగా ఫీలవుతున్నారు.