రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఏ స్థాయిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘బాహుబలి’ తర్వాత ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఆయన సినిమాలు కోసం ఒక్క సౌత్ ఇండియా ప్రేక్షకులే కాదు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ప్రజెంట్ ఆయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. దీని మీద అభిమానుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. నిన్న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ పేరుతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read: గర్జించిన ‘కొమురంభీం’.. రికార్డులన్నీ బద్దలు..!
సినిమాలోని సంగీతం ఏ స్థాయిలో ఉంటుందో శాంపిల్ చూపడానికి దీన్ని రూపొందించారు టీమ్. విడుదలైన కొద్దిసేపటికే ఈ మోషన్ పోస్టర్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్స్ జాబితాలో చేరిపోయింది. సినీ ప్రేక్షకులంతా భాషా బేధం లేకుండా ఎగబడి మరీ చూసేశారు. దీంతో 24 గంటల్లో పాత మోషన్ పోస్టర్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. 24 గంటల్లో 4.73 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అప్పటివరకు ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ పేరు మీదున్న 4.64 మిలియన్ వ్యూస్ రికార్డ్ ఖల్లాస్ అయిపోయి రెండవ స్థానానికి దిగిపోయింది.
Also Read: బాలయ్యా నువ్వు గ్రేటయ్యా.. కోటి కొట్టేశావ్.. !
ఇక ఈ జాబితాలో మూడవ స్థానంలో 2.5 మిలియన్ వ్యూలతో మహేష్ ‘సర్కారువారి పాట’ మోషన్ పోస్టర్ ఉండగా నాల్గవ స్థానంలో 1.91 వ్యూలతో పవన్ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ఉంది. ఇక లైక్స్ విషయానికి వస్తే 24 గంటల్లో 3 లక్షల 59 వేల లైక్స్ పొందిన ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ మొదటి స్థానంలో ఉండగా ‘రాధే శ్యామ్’ 2 లక్షల 53 వేల లైక్స్ పొంది రెండవ స్థానానికి చేరుకుంది. కేవలం మోషన్ పోస్టర్ ద్వారానే ఇంత భీభత్సం చేసిన ప్రభాస్ టీజర్, ట్రైలర్లతో ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.