Kidney Stones: ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామందికి కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి. ఈ స్టోన్స్ వల్ల తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆరోగ్యం సహకరించదు. ప్రధానంగా నీటిని ఎక్కువగా తీసుకోని వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటున్నారు నిపుణులు. అయితే ఒక రాష్ట్రంలోని ప్రజలకు ఈ సమస్యనే రాదట. మరి ఎందుకు రాదు? ఆ రాష్ట్రం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్ల సమస్యకు చాలా దూరంగా ఉండే రాష్ట్రం కేరళ. ఈ ప్రజలకు స్టోన్స్ సమస్య చాలా తక్కువ ఉంటుందట. దీనికి కారణం కూడా ఉంది. అయితే అరటి చెట్టును మధ్యలో కట్ చేసి దానిలోని తురుము తీసి, దానికి ప్లాస్టిక్ కవర్, లేదా గోణె సంచిని కప్పి ఉంచుతారట. ఇలా చేసిన తర్వాత మరసటి రోజుకు అందులో నీరు నిల్వ ఉంటుందట. ఇలా నిల్వ ఉన్న నీరును ఫిల్టర్ చేసి దాన్ని తాగుతారట.
అరటి చెట్టులో లభించే ఈ నీరు కిడ్నీలకు దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. అయితే ఈ రాష్ట్ర ప్రజలు చాలా మంది ఇదే విధంగా చేస్తుంటారట. అందుకే ఈ రాష్ట్రంలోని ప్రజలకు చాలా వరకు రాళ్ల సమస్య రావు అంటున్నారు. మీరు కూడా ఇలాంటిది ఇంటి వద్ద ట్రై చేయాలి అనుకుంటే దీని గురించి పూర్తిగా అవగాహనతో చేయండి. లేదంటే ఒకసారి ఈ ప్రాసెస్ గురించి తెలిసిన నిపుణులను సలహా తీసుకోవడం మంచిది. ఈ నీరు ప్రతి ఒక్కరికి సూట్ అవుతుందా లేదా అని క్లారిటీ వచ్చిన తర్వాత తీసుకోవడం ఉత్తమం.