https://oktelugu.com/

Kalki Director: నాగ్ అశ్విన్ లో అశ్వినీ దత్ కూతురు ఏం చూసి ఇష్టపడిందో తెలుసా… కల్కి డైరెక్టర్ క్రేజీ లవ్ స్టోరీ!

Kalki Director: నాగ్ అశ్విన్ అందగాడు కాదు. డబ్బున్నవాడు కూడా కాదు. చాలా సాదాసీదా కుర్రాడు. జుట్టు, గడ్డం పెంచి.. నాసిరకం బట్టలు ధరించి సింపుల్ గా ఉంటాడు. అది అతడి లైఫ్ స్టైల్.

Written By:
  • Neelambaram
  • , Updated On : July 1, 2024 / 04:52 PM IST

    Kalki Movie Director Nag Ashwin Love Story

    Follow us on

    Kalki Director: దర్శకుడు నాగ్ అశ్విన్ ఫేమ్ కల్కి చిత్రంతో మారిపోయింది. కేవలం రెండు చిత్రాలు తీసిన కుర్రాడు ఏకంగా యూనివర్సల్ సబ్జెక్ట్ తో మూవీ చేశాడు. కాకలు తీరిన దర్శకులకు కూడా సాధ్యం కానీ విజువల్స్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. సౌత్ లోనే కాదు ఇండియా మొత్తంలో కల్కి రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కలేదు. కల్కి వంటి ఒక అద్భుత చిత్రం తెరకెక్కించిన నాగ్ అశ్విన్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. నాగ్ అశ్విన్ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. కేవలం నెలకు రూ. 4 వేలు తీసుకుని సినిమాలకు పని చేసినట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు.

    నాగ్ అశ్విన్ అందగాడు కాదు. డబ్బున్నవాడు కూడా కాదు. చాలా సాదాసీదా కుర్రాడు. జుట్టు, గడ్డం పెంచి.. నాసిరకం బట్టలు ధరించి సింపుల్ గా ఉంటాడు. అది అతడి లైఫ్ స్టైల్. నాగ్ అశ్విన్ ఆరు వందల కోట్ల సినిమా తీసిన అతని లైఫ్ స్టైల్ అలానే ఉంటుంది. మేటర్ ఏంటంటే… ఇలాంటి ఓ సాధారణ, చిన్న డైరెక్టర్ అశ్వినీ దత్ అల్లుడు ఎలా అయ్యాడు.అశ్వినీ దత్ బ్యాక్ గ్రౌండ్, నిర్మాతగా అతని హిస్టరీ అందరికీ తెలిసిందే. ఆయనకు రాజకీయ పరిచయాలు గట్టిగా ఉన్నాయి.
    గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ప్రియాంక దత్ ని నాగ్ అశ్విన్ ప్రేమలో ఎలా పడేశాడు? అనే సందేహాలు ఉన్నాయి.

    ఈ ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పారు. మహానటి విడుదల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ప్రియాంక దత్ తో నా లవ్ స్టోరీ సాధారణంగా ఉంటుంది. అంత సినిమాటిక్ గా ఉండదు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి ముందే ప్రియాంకతో నాకు పరిచయం ఉంది. కలిసి కొన్ని యాడ్స్ చేశాము. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ సెట్స్ లో మా పరిచయం మరింత బలపడింది. పెళ్లీడు వచ్చింది. ఎవరినో ఒకరిని చేసుకోవాలి. మనమిద్దరం చేసుకుందామా… అని అనుకున్నాం. అలా పెళ్ళై పోయింది.

    ప్రియాంక దత్ కి నాలో నచ్చిన విషయం చెప్పాలంటే… మా ఇద్దరి లక్ష్యాలు ఒక్కటి కావటమే. ఎప్పుడూ ఒక మంచి సినిమా చేయాలనే ఆలోచనలో ఉండేవాళ్ళం. లక్ష్యం పైనే ఫోకస్ పెట్టడం ఆమెకు నచ్చి ఉండవచ్చు. ప్రియాంక దత్ లైఫ్ స్టైల్ సింపుల్ గానే ఉంటుంది. తనది డౌన్ టు ఎర్త్ నేచర్. అశ్వినీ దత్, స్వప్న కూడా సాధారణంగా ఉంటారని… నాగ్ అశ్విన్ అన్నారు. ప్రియాంకను వివాహం చేసుకునే నాటికి నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి మాత్రమే దర్శకత్వం వహించారు. నాగ్ అశ్విన్-ప్రియాంక దత్ వివాహానికి చిత్ర ప్రముఖులు అందరూ హాజరయ్యారు.