Tree : ఈ చెట్టు ఉందా? అయితే మీరు లక్కీ.. ఆరోగ్యం మీ చేతుల్లోనే..

చుండ్రు తగ్గుతుంది: చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడతారు. ఇలాంటి వారు పారిజాత పువ్వులతో చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. పారిజాత చెట్టు గింజలను పేస్టులా చేసి తలకు పట్టాలి.

Written By: Swathi Chilukuri, Updated On : September 8, 2024 10:47 pm

Parijatham tree will make you lucky and healthy

Follow us on

Tree : పారిజాత చెట్టు, పువ్వుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలిసు. ప్రయోజనాలు కూడా తెలుసు కదా. ఈ పువ్వుల నుంచి మంచి సువాసన సూపర్ గా వస్తుంటుంది. పూజలకు ముఖ్యంగా ఈ పువ్వులను ఉపయోగిస్తారు. అయితే ఈ చెట్టు, పువ్వులతో కేవలం పూజలే కాదు మరిన్ని ప్రయోజనాలు కూడా ఎక్కువే ఉన్నాయి అంటున్నారు నిపుణులు. శ్రీ కృష్ణుడు సత్య భామ కోసం పారిజాత వృక్షాన్ని తీసుకోని వచ్చాడట. ఈ చెట్టు దివి నుంచి భూమికి తీసుకొచ్చాడని చెబుతుంటారు. ఈ విషయాన్ని పురాణాలు చెబుతూ ఉంటాయి. పారిజాత చెట్టు పువ్వు, ఆకులు, గింజలు వైద్య పరంగా వినియోగించవచ్చట.అయితే ఆయుర్వేదంలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా వాడుతుంటారు. పారిజాత పుష్పం.. ఆకులు.. చెట్టు బెరడుతో కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పారిజాత పువ్వులతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఓ సారి చూసేద్దామా?

ఒత్తిడిని తగ్గిస్తుంది: ఒత్తిడి సర్వసాధారణంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య. బీజీ లైఫ్, టెన్షన్స్ వల్ల ఒత్తిడికి గురి అవుతున్నారు ప్రజలు. అయితే ఈ పువ్వులు ఒత్తిడిని దూరం చేస్తాయట. పారిజాత పువ్వులతో ఒత్తిడి, ఆందోళనకు చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేదంలో ఈ పువ్వులను సహజ నివారణగా పరిగణిస్తుంటారు. అయితే ఈ పూలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

చుండ్రు తగ్గుతుంది: చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడతారు. ఇలాంటి వారు పారిజాత పువ్వులతో చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. పారిజాత చెట్టు గింజలను పేస్టులా చేసి తలకు పట్టాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాదు జుట్టు సాఫ్ట్‌గా సిల్కీగా మారుతుంది కూడా.

గొంతు నొప్పి: గొంతు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది ఈ పారిజాత చెట్టు. దీని ఆకులతో మీ గొంతు సమస్యకు చెక్ పెట్టవచ్చు. చెట్టు ఆకులను ఉడకబెట్టి కషాయాల రూపంలో తాగాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి మాత్రమే కాకుండా.. ఇతర శారీరక నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి అంటున్నారు నిపుణులు. కీళ్ల వాపులు, ఆర్థరైటిస్ నొప్పులు నయం అవుతాయి.

రోగ నిరోధక శక్తి: ఈ చెట్టు ఆకులు లేదా పువ్వులతో టీ తయారు చేసుకుని తాగాలి. ఈ టీ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. దీంతో ఇతర అనారోగ్య సమస్యలతో శరీరం పోరాడటానికి కావాల్సిన శక్తి వస్తుంది.

సీజనల్ వ్యాధులు: వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు వస్తాయి. అంటే జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఎక్కువగా బాధ పెడుతుంటాయి. ఇలాంటి వ్యాధులు రాకుండా.. ఇమ్యూనిటీ బలంగా కావాలి అనుకునేవారు ఈ చెట్టు, ఆకులు పువ్వులతో టీ, కషాయం చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ కషాయంలో తేనె కలుపుకుని తాగితే శ్వాస కోశ సమస్యలు, ఊపిరి తిత్తుల్లో పేరుకు పోయిన కఫం కూడా తగ్గుతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.