https://oktelugu.com/

Big Boss 8 Telugu: బెజవాడ బేబక్క అవుట్..ఒక్క వారం ఆమె హౌస్ లో ఉన్నందుకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మణికంఠ ఇక నుండి అయినా ఎమోషనల్ డ్రామాలు ఆడకుండా, కాస్త మనిషి లాగా ప్రవర్తిస్తే గేమ్ లో ఉంటాడు, లేకపోతే వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేది ఆయనే అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. గత సీజన్ లో లాగా పల్లవి ప్రశాంత్ ఫార్ములా వాడి టైటిల్ కొట్టడం అంటే ఈసారి కుదరదు. పల్లవి ప్రశాంత్ బయటకి వచ్చిన అతని అసలు రంగు జనాలు చూసారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 / 08:06 AM IST

    Big Boss 8 Telugu

    Follow us on

    Big Boss 8 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి అందరూ ఊహించినట్టుగానే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో ఈమె తనపై ఏమి జరిగిన చాలా తేలికగా తీసుకొని సాఫ్ట్ గా ఉండడం, ఈమె ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోవడం వల్ల మొదటి వారంలోనే హౌస్ నుండి బయటకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బేబక్క డేంజర్ జోన్ లో ఉంది అనే విషయం అందరికీ అర్థం అయ్యింది కానీ, నాగ మణికంఠ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. నాగార్జున గత సీజన్ లో కూడా చెప్పాడు, ప్రతీ వారం నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో చివరి ఇద్దరు ఎవరైతే ఉంటారో, వాళ్ళే బాటమ్ 2 కంటెస్టెంట్స్ అని. ఆ లెక్కన ఈరోజు బేబక్కతో పాటుగా మణికంఠ కూడా ఉన్నాడు.

    కాబట్టి మణికంఠ ఇక నుండి అయినా ఎమోషనల్ డ్రామాలు ఆడకుండా, కాస్త మనిషి లాగా ప్రవర్తిస్తే గేమ్ లో ఉంటాడు, లేకపోతే వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేది ఆయనే అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. గత సీజన్ లో లాగా పల్లవి ప్రశాంత్ ఫార్ములా వాడి టైటిల్ కొట్టడం అంటే ఈసారి కుదరదు. పల్లవి ప్రశాంత్ బయటకి వచ్చిన అతని అసలు రంగు జనాలు చూసారు. ఇలాంటి సానుభూతి డ్రామాలను జనాలు నమ్మరు , వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, 151 సీట్లు గెలిచిన జగన్ కి మొన్నటి ఎన్నికలలో 11 సీట్లు వచ్చేలా చేసిన జనాలు అక్కడ ఉన్నది, అలాంటి వాళ్ళతో ఆటలు ఆడితే ఎలా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాపం బెజవాడ బేబక్క వచ్చే వారం తనని తాను నిరూపించుకోవాలని చాలా కసి మీద ఉండేది, కానీ జనాలు ఆమెని ఇంటికి పంపేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రావడమే ఒక పెద్ద ఛాలెంజ్, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఆమె ఇప్పుడు బాగా దగ్గరైంది.

    దీని వల్ల ఇప్పుడు ఆమె యూట్యూబ్ ఛానల్ కి కూడా వ్యూస్ మరింత పెరుగుతాయి. కాబట్టి బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది వారం రోజులే అయినప్పటికీ, జీరో నెగటివిటీ తో ఆమెకి కచ్చితంగా ఈ షో ప్లస్ అయ్యేలాగానే బయటకి వెళ్ళింది. వారం రోజులు ఆమె హౌస్ లో ఉన్నందుకు గానూ బిగ్ బాస్ టీం ఆమెకి 2 లక్షల 50 వేల రూపాయిలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది చాలా మంచి ప్యాకేజ్, కాస్త స్ట్రాంగ్ గా నిలబడుంటే మరో రెండు మూడు వారాలు హౌస్ లో కొనసాగేది, పాపం బేబక్క. ఇకపోతే ఈరోజు హౌస్ లో బేబక్క ఎలిమినేట్ అయితే చాలా మంది బాధపడ్డారు, నిఖిల్ తో ఆమెకి మొన్ననే గొడవ అయ్యింది, కానీ నిఖిల్ కూడా బాధ పడ్డాడు అంటే హౌస్ లో ఆమె ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.