OTT Addiction Effects: సోషల్ మీడియా నేటి యువత మీద విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. సోషల్ మీడియా మాత్రమే కాదు ఓటిటి లు కూడా యువత మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కౌమార దశలో పిల్లలు ఓటీటీలు చూస్తూ వికృతాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాలలో అఘాయిత్యాలకు వెనుకాడటం లేదు. ఓటీటీలు చూస్తూ ఓ బాలుడు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read: ఫోన్ ఇచ్చి పిల్లలను దునియా చూడకుండా చేస్తున్నారా? కళ్ళకు ఎంత ప్రాబ్లమో తెలుసా?
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో మ్యూజీషియన్ గణేష్, సింగర్ సవిత దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి గంగాధర్ అనే 14 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో చదువుకుంటున్నాడు. కోవిడ్ సమయం నుంచి ఇతడికి ఫోన్ అలవాటయింది. అప్పట్లో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో గంగాధర్ కు గణేష్, సవిత దంపతులు ఫోన్ కొనిచ్చారు.
ఫోన్ చూసేందుకు అలవాటు పడిన గంగాధర్.. దానిని ఒక వ్యసనం లాగా మార్చుకున్నాడు. తల్లిదండ్రులు లేని సమయంలో రకరకాల ఓటీటీలు చూడటం మొదలుపెట్టాడు. అందులో ఇటీవల జపాన్ వెబ్ సిరీస్ డెత్ నోట్ చూడటం మొదలుపెట్టాడు. డెత్ నోట్ వెబ్ సిరీస్ అధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఆ సిరీస్లో మాదిరిగానే గంగాధర్ ప్రవర్తించడం మొదలుపెట్టాడు. గదిలోకి వెళ్లి గిటార్ స్ట్రింగ్ తో ఉరి వేసుకున్నాడు.
Also Read: లిప్‌స్టిక్ ఎంత డేంజరో తెలుసా? వీడియో వైరల్
ఉరి వేసుకోవడానికి అంటే ముందు గంగాధర్ ఒక లేఖ రాశాడు.. నేను వెళ్లే సమయం ఆసన్నమైందని.. ఈ లేఖ చదివే సమయానికి తాను స్వర్గంలో ఉంటానని గంగాధర్ రాశాడు.. గంగాధర్ డెత్ నోట్ వెబ్ సిరీస్ కు విపరీతంగా అలవాటు పడటం వల్ల అందులో నటుల మాదిరిగానే ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తద్వారా అందులో పాత్రల మాదిరిగానే తనకు తాను మరణాన్ని శిక్షగా విధించుకున్నాడు. అయితే గంగాధర్ ఇలా చేసుకోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. గంగాధర్ ఉదంతం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఓటీటీలపై సెన్సార్ విధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.