World Lion Day: అడవికి ఎప్పటికైనా రాజు సింహం మాత్రమే.. ఈ మృగాన్ని ఢీకొట్టడానికి ఏ జంతువు ప్రయత్నించినా సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో లయన్ పై దాడి చేయడానికి కొన్ని జంతువులు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ సింహం లో ఉండే ధైర్యం మిగతా జంతువుల్లో తక్కువగానే ఉంటుంది అని అనుకోవచ్చు. అందుకే అడవికి రాజుగా ఇది కొనసాగుతూ ఉంటుంది. అయితే కొన్ని కారణాలవల్ల సింహాలు రాను రాను తగ్గిపోతున్నాయి. ఇలా వీటి గురించి ప్రత్యేకంగా తెలియజేయడానికి.. లేదా సింహంపై ప్రజలకు అవగాహన తెలియజేయడానికి ప్రతి ఏటా సింహాల దినోత్సవం (world lions day) నిర్వహిస్తున్నారు. మరి ప్రస్తుతం సింహాల సంఖ్య ఎంత ఉంది?
Also Read: దట్టమైన అడవిలో గోకర్ణ గుహలో రష్యన్ మహిళ.. పోలీసులు చూసి షాక్.. ఏం జరిగిందంటే?
ఒక విషయం గురించి కనుమరుగు పోతూ ఉంటే దానిపై అవేర్నెస్ తీసుకురావడానికి ప్రత్యేకంగా ఒక రోజులు కేటాయించి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే అరుదైన జాతి జంతువు సింహాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటాయి. మనదేశంలో గిర్ అడవి సింహాలకు ప్రత్యేకంగా ఉంటుంది. అయితే సింహాల గురించి తెలియజేయడానికి Dereck Jouber, Beverly Joubert అనే వ్యక్తులు 2013 సంవత్సరంలో ఆగస్టు 10వ తేదీ నుంచి సింహాల దినోత్సవం ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఏటా సింహాలపై అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆఫ్రికా దేశంలో ఎక్కువగా కనిపించే సింహాలు 2001 నుంచి 43% తగ్గుతున్నాయి. అలాగే భారతదేశంలో కనిపించే సింహాలు 2017లో 523 ఉంటే.. 2025 మే నాటికి 891 కి పెరిగింది. ఆసియా దేశాల్లో భారత దేశంలో ఉండే సింహాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే సింహాల సంఖ్య కొన్ని ప్రాంతాల్లో ఘననీయంగా తగ్గుతున్నా.. భారతదేశం లాంటి ప్రాంతాల్లో వాటికి ప్రాధాన్యత ఇస్తూ సంతాన ఉత్పత్తిని పెంచుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ జంతు సంరక్షణ చట్టం ద్వారా సింహాలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇదే సమయంలో సింహాల నుంచి ప్రజలను రక్షించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక మగ సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఈ శబ్దం విని రక్షణ చర్యలు ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాలో తెలుపుతున్నారు.
Also Read: తన సొంత 70 ఎకరాల్లో అడవిని సృష్టించాడు.. గొప్పగా చదువుకొని జంతువులకు వదిలేశాడు
మిగతా జంతువుల కంటే సింహం లో ప్రత్యేక శక్తి ఉంటుంది. దీని శరీర భాగాలు బలంగా ఉంటాయి. గంభీరమైన రూపుతో పాటు పెద్ద జుట్టు ఉండడంతో ఇది ఇతర జంతువులను అవలీలగా ఎదుర్కొనే శక్తి మీ కలిగి ఉంటుంది. సింహాలు ఎప్పుడూ గ్రూపులుగా ఉంటాయి. వీటికి ఒక సింహం నాయకుడిగా వ్యవహరిస్తుంది. వాటిపై ఏ జంతువు దాడి చేయడానికి ధైర్యం చేయరు. అయితే మగ జంతువు తమ స్థలం కోసం పక్క సింహాలను కూడా చంపేయగలరు. అందుకే సింహం ఒక గుహను లేదా ప్రాంతాన్ని ఆక్రమిస్తే అక్కడికి మరో సింహం వెళ్లడానికి ధైర్యం చేయదు. ఇలా సింహం లో ఉండే ప్రత్యేక లక్షణాలతోనే అది అడవికి రాజుగా ఉండగలుగుతుంది.