కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయా..?

దేశంలోని ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో అతి త్వరలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తాము కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోబోమని పలువురు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. కోలుకున్నా ఆ సమస్యలు..? బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు ఇప్పటికే […]

Written By: Navya, Updated On : December 10, 2020 6:06 pm
Follow us on


దేశంలోని ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో అతి త్వరలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తాము కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోబోమని పలువురు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ ను వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. కోలుకున్నా ఆ సమస్యలు..?

బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు ఇప్పటికే ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న పలువురు సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డారు. దీంతో అక్కడి అధికారులు అలర్జీతో బాధ పడే వాళ్లు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవద్దని సూచనలు చేశారు. మరి కరోనా వ్యాక్సిన్ల వల్ల నిజంగానే సైడ్ ఎఫెక్ట్ వస్తాయా..? అనే ప్రశ్నకు కొన్ని వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని మరికొన్ని వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావని చెబుతున్నారు.

Also Read: భారత ప్రజలకు శుభవార్త.. వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారంటే..?

రోగ నిరోధక శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని.. అయితే సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడి వ్యాక్సిన్ తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని చెబుతున్నారు. కొందరిలో జ్వరం, నొప్పి, మంట, తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయని అయితే తాత్కాలికంగా మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

వైరస్ ఆర్‌ఎన్‌ఏ లేదా డీఎన్‌ఏల నుంచి వ్యాక్సిన్లను తయారు చేస్తారని.. వ్యాక్సిన్ల తయారీ మనకు హాని కలిగించే వైరస్ ను బలహీనపరిచే విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో శరీరతత్వాన్ని కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.