ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..?

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నోలెడ్జ్ టెక్నాలజీస్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వాలని డిప్రియేషన్ కింద 0.4 పాయింట్లు కలిపే విధంగా నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. Also Read: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. పరీక్ష పేపర్ల సంఖ్య కుదింపు..? […]

Written By: Kusuma Aggunna, Updated On : December 10, 2020 5:54 pm
Follow us on


రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నోలెడ్జ్ టెక్నాలజీస్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వాలని డిప్రియేషన్ కింద 0.4 పాయింట్లు కలిపే విధంగా నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. పరీక్ష పేపర్ల సంఖ్య కుదింపు..?

సాధారణంగా ప్రైవేట్ పాఠశాలలతో పోల్చి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మంచి మార్కులు తెచ్చుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు సమాన ప్రాధాన్యత ఇస్తే ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. డిప్రియేషన్ కింద మార్కులు కలపకపోతే ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే సీట్లు లభించే అవకాశం ఉంటుంది.

Also Read: విద్యార్థులకు శుభవార్త.. పది రోజులు నో స్కూల్ బ్యాగ్ డే..!

ఏపీలో శ్రీకాకుళం, నూజీవీడు, ఒంగోలు, ఇడుపులపాయలలో ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ నాలుగు క్యాంపస్ ల ద్వారా 4,000 సీట్ల భర్తీ జరుగుతోంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు పదో తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేసేవాళ్లు. ఈ సంవత్సరం మాత్రం కరోనా విజృంభణ వల్ల పరో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రతి సంవత్సరం ప్రవేశాల గురించి నిర్ణయం తీసుకుంటుంది. డిప్రివేషన్ ‌ కింద 0.4 పాయింట్లు కలపడం ప్రభుత పాఠశాలల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోలిస్తే ఎక్కువ ప్రాధాన్యత దక్కనుంది. పాయింట్లు కలపడం వల్ల 93 శాతం మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.