Onions Benefits: ప్రస్తుత కాలంలో చాలామందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఒత్తిడి, నిద్రలేమి వల్ల ఎంతోమంది బాధ పడుతున్నారు. మారుతున్న జీవనశైలి వల్ల షుగర్ లేదా బీపీ వల్ల బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే అనేక వ్యాధులకు ఉల్లిపాయతో సులభంగా చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో ఉల్లిపాయ తింటే షుగర్ కు సులభంగా చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మూత్ర సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు వేడినీటిలో ఉల్లిని వేసి ఆ నీటిని తాగితే మూత్రంలో మంట, ఇతర సమస్యలు దూరమవుతాయి. ఉల్లిగడ్డ గుజ్జుతో వెనిగర్ ను కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు సులభంగా దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం, బీపీ, గుండెపోటుకు చెక్ పెట్టడంలో ఉల్లిపాయ ఉపయోగపడుతుంది.
జ్వరం ఉన్న సమయంలో ఉల్లిపాయ తింటే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. కీళ్లకు, గుండెకు, అలాగే రక్తపోటును అదుపులో ఉంచడానికి ఉల్లి తోడ్పడుతుంది. ఉల్లిని ప్రతిరోజూ తీసుకోవడం గురించి ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదిస్తే మంచిది.