Hyderabad Software lady: సాఫ్ట్ వేర్ యువతి.. ఎన్నో కలలు కన్నది. కాబోయే వరుడి కోసం ఆశలు పెంచుకుంది. మరో నెలరోజుల్లో పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తూ కానరానకుండా పోయింది. డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చి మరో 5 నిమిషాల్లో వస్తానంటూ వెళ్లిన సాఫ్ట్ వేర్ యువతి అనంతలోకాలు వెళ్లింది. మృత్యువు ఆమెను కబళించింది.
శుక్రవారం రాత్రి నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నడిపిస్తున్న యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Also Read: ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన యువకుడు.. ఏం చేశాడంటే?
హైదరాబాద్ డీఆర్డీఏ పరిధిలో నివాసం ఉండే నిధా రెహమాన్ (34) అబిడ్స్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లింది. వెంటనే మరో 5 నిమిషాల్లో వస్తా అని ఇంట్లోని తల్లిదండ్రులకు చెప్పి యూసఫ్ గూడలో ఉండే కాబోయే భర్త పఠాన్ షవాజ్ నవాబ్ ఖాన్ ను కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.
కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ లో తన ముందు వేగంగా వెళుతున్న ఓ లారీని తప్పించబోయే క్రమంలో బైక్ స్కిడ్ అయ్యింది. వెనుకే వస్తున్న వాటర్ ట్యాంకర్ వెనుక చక్రాల కింద పడడంతో తలభాగం నుజ్జునుజ్జు అయ్యింది. యువతిని గుర్తించలేని విధంగా పడి ఉంది.
యూసఫ్ గూడకు చెందిన షవాజ్ నవాబ్ ఖాన్ తో యువతి ప్రేమలో ఉంది. రెండు కుటుంబాల వారు వీరి వివాహానికి ఒప్పుకున్నారు. మరో నెలరోజుల్లో పెళ్లి అనగా ఈ దుర్ఘటన జరిగింది. ఇంతటి ఘోరం జరగడంతో రెండు కుటుంబాల వారు విషాదంలో మునిగిపోయింది.
Also Read: కవిత కోసం ఎమ్మెల్సీ పదవి సిద్ధమేనా?