Corona Virus: కరోనా వైరస్ బారి కోలుకున్న పడిన వాళ్లను నిత్యం అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంతమంది సంతోషంగా జీవనం సాగిస్తుంటే మరి కొందరిని మాత్రం ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో తుంటి కీలు అరిగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వేధిస్తున్న వారిలో 95 శాతం మంచి పురుషులు ఉండటం గమనార్హం.
సాధారణంగా 60 నుంచి 70 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో తుంటి కీలు అరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కరోనా సోకిన సమయంలో ఎక్కువగా స్టెరాయిడ్స్ ను వాడటం వల్ల కొంతమందిని ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోందని తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గినా కరోనా నుంచి కోలుకున్న వాళ్లను మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బంది పెడుతున్నాయి. పరిమితికి మించి స్టెరాయిడ్స్ ను వాడిన వాళ్లను ఈ ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం గమనార్హం.
Also Read: KTR : హతవిధీ.. క్రేన్ కు కట్టి పెట్టినా కేటీఆర్ కరుణించలేదే?
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం పడుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో వైరస్ బారిన పడిన వాళ్లలో ఎక్కువమందిని ఈ ఆరోగ్య సమస్య వేధిస్తుండటం గమనార్హం. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారిని ఈ ఆరోగ్య సమస్య వేధిస్తుండటంతో ఆశ్చర్యానికి గురవుతున్నామని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తుంటి కీలు మార్పిడి చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
మందులు వాడటం ద్వారా తాత్కాలికంగా ఈ సమస్య నుంచి ఉపశమనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వైద్యుల సూచనల మేరకు క్యాల్షియం, డి విటమిన్ ట్యాబ్లెట్లను వాడి తాత్కాలికంగా సమస్యను అధిగమించవచ్చు. సమస్య నాలుగో దశలోకి చేరితే తుంటి కీలు మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.
Also Read: AP Govt Announced New Jobs: కేసీఆర్ ను ఫాలో అవుతున్న జగన్.. ఏపీలొ కొలువుల జాతర.. సేమ్ స్ట్రాటజీ
Recommended Video: