Common Civil Code : కేంద్రం కామన్ సివిల్ కోడ్ బిల్లు తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. వర్షాకల పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే దీనిని విపక్షాలు వ్యతిరేకించాలని భావిస్తున్నాయి. దీంతో అసలు కామన్ సివిల్ కోడ్ అంటే ఏమిటి.. అది వస్తే ఏమౌతుంది. విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయన్న కన్ఫ్యూజన్ ప్రజల్లో నెలకొంది.