Omicron: ఒమిక్రాన్ సోకిన వాళ్లకు షాకింగ్ న్యూస్.. కంటిలో ఆ మార్పులు కనిపిస్తాయట!

Omicron:  దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా అందరూ ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ గత వేరియంట్లతో పోలిస్తే తక్కువగానే ప్రభావం చూపుతుండటం గమనార్హం. ముఖ్యంగా గత పదిరోజుల నుంచి కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. కరోనా రోగులకు దగ్గు ముఖ్యమైన లక్షణం అనే సంగతి తెలిసిందే. […]

Written By: Kusuma Aggunna, Updated On : January 22, 2022 2:26 pm
Follow us on

Omicron:  దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా అందరూ ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ గత వేరియంట్లతో పోలిస్తే తక్కువగానే ప్రభావం చూపుతుండటం గమనార్హం.

Omicron

ముఖ్యంగా గత పదిరోజుల నుంచి కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. కరోనా రోగులకు దగ్గు ముఖ్యమైన లక్షణం అనే సంగతి తెలిసిందే. అయితే ఒమిక్రాన్ సోకిన వాళ్లను కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. ఒమిక్రాన్ సోకిన వాళ్లలో కొంతమందికి కంటి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కంటిచూపు మందగించడం, కండ్లకలక, కళ్లు ఎర్రబడటం ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి.

Also Read: డెల్టాకు, ఒమిక్రాన్ కు తేడా ఏంటి? ఒమిక్రాన్ ను ఎలా గుర్తుపట్టాలి?

మరి కొంతమందిలో కంటివాపుతో పాటు కంటిలోని తెల్లటి భాగం కూడా వాపుకు గురవుతూ ఉండటం గమనార్హం. కంటికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. లక్షణాలు ఉన్నవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకుంటే కరోనా నిజంగా సోకిందో లేదో తెలిసే అవకాశం అయితే ఉంటుంది.

ఒక అధ్యయనం ప్రకారం కరోనా సోకిన వాళ్లలో 44 శాతం మంది రోగులు కంటి సమస్యలను ఎదుర్కొన్నారు. కరోనా సోకితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: మీ మెదడు పనితీరు అద్భుతంగా పని చేయాలా ?.. ఐతే.. !