https://oktelugu.com/

Hair Health: రాత్రి సమయంలో జట్టుకు నూనె రాస్తున్నారా? తప్పక ఇది తెలుసుకోండి

జుట్టు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ చాలా మంది నూనె రాసుకుంటారు. ఈ విధంగా రాసుకోవడం మంచి పద్ధతేనట. ఇది హెయిర్ ను కాపాడుతుంది. అయితే ఆయిల్ ను అప్లై చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 2, 2024 / 06:24 PM IST
    Follow us on

    Hair Health: సాధారణంగా చాలా మంది అమ్మాయిలు లేదా అబ్బాయిలు జట్టును ఎంతో ఇష్టంగా చూసుకుంటుంటారు. దాని కోసం వివిధ రకాల ఆయిల్స్, షాంపూలు వంటి వాటిని వినియోగిస్తుంటారు. జట్టు ఆరోగ్యంగా కనిపించడం కోసం ఎంతో తాపత్రయ పడుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు రాత్రి సమయంలో జట్టుకు నూనె రాసుకుంటుంటారు. అయితే ఇలా చేయడం మంచిదేనా? కాదా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

    జుట్టు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ చాలా మంది నూనె రాసుకుంటారు. ఈ విధంగా రాసుకోవడం మంచి పద్ధతేనట. ఇది హెయిర్ ను కాపాడుతుంది. అయితే ఆయిల్ ను అప్లై చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

    జుట్టుకు నూనె రాసి రాత్రంతా వదిలేయడం వలన కొన్ని నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా స్కాల్ప్ సహజ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా మనం కూడా తలకు నూనె పట్టించి వదిలేయడం వలన దద్దుర్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఎక్కువ సేపు నూనె రాసుకోవడం వలన ముఖంపై పిగ్మెంటేషన్ ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    బాగా వేడి నూనెను తలకు పట్టించకూడదు. గోరు వెచ్చని నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం మంచిది. ఈ విధంగా చేయడం వలన తలలో రక్త ప్రసరణ మంచి జరిగి జుట్టును వేగంగా పెరిగే విధంగా చేస్తుంది. అదేవిధంగా కొబ్బరి నూనెకు బదులు ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెను వినియోగించవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. పొడి మరియు సిల్కీ హెయిర్ కు ప్రతి రోజూ నూనె రాస్తే మంచిదని .. ఇలా చేయడం వలన తగినంత తేమ అంది కురులు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే తలస్నానానికి అరగంట ముందు నూనె రాసుకుంటే సరిపోతుందని వెల్లడిస్తున్నారు.