https://oktelugu.com/

Anant Ambani Pre Wedding: కొడుకు ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కన్నీరు పెట్టిన అంబానీ.. ఎందుకంటే..

అనంత్‌ అంబానీ – రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడులకు భారత్‌ క్రికెటర్లతోపాటు విదేశీ క్రికెటర్లు కూడా భారీగా తరలి వచ్చారు. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్, సాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ నుంచి మధ్యలో వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.

Written By: , Updated On : March 2, 2024 / 06:30 PM IST
Anant Ambani Pre Wedding
Follow us on

Anant Ambani Pre Wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త, రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తన నిన్నకుమారుడు అనంత్‌ అంబీనీ ప్రీవెడ్డింగ్‌ వేడుకలను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంత్‌ అంబానీ–రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. మార్చి 3 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.

ముఖేష్‌ అంబానీ భావోద్వేగం..
ఇదిలా ఉండగా అనంత్‌ అంబానీ – రాధిక మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో ముఖేష్‌ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. వేడుకల్లో భాగంగా అనంత్‌ అంబానీ మాట్లాడారు. ‘అతిథులకు స్వాగతం.. ఈ వేడుక ఇంత గ్రాండ్‌గా జరగడానికి మా అమ్మ కారణం. ఆమె రోజుకు 18 గంటలు కష్టపడ్డారు. నా జీవితం పూలపాన్పు కాదు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో అమ్మనాన్న నాకు అండగా నిలిచారు. రాధిక నా భార్యగా రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని మాట్లాడారు. ఈ స్పీర్‌ విన్న ముఖేష్‌ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టారు.

వేడులకు క్రికెటర్లు..
అనంత్‌ అంబానీ – రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడులకు భారత్‌ క్రికెటర్లతోపాటు విదేశీ క్రికెటర్లు కూడా భారీగా తరలి వచ్చారు. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్, సాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ నుంచి మధ్యలో వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. పొలార్డ్‌ ఐపీఎల్‌లో ఆడినంతకాలం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యాజమాన్యంలోని ముంబై ఇండయన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. ఇక ప్రీ వెడ్డింగ్‌కు హాజరైన విదేశీ క్రీడాకారుల్లో ఆస్ట్రేలియాకు చెందిన టిమ్‌ డేవిడ్, న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్‌ బోల్ట్, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్‌ బ్రావో, నికోలస్‌ పూరన్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్‌ఖాన్, ఇంగ్లండ్‌కు చెందిన సామ్‌ కర్రాన్‌ తదితరులు ఉన్నారు. టీమిండియా నుంచి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్, మాజీ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్, ధోనీ, జహీర్‌ఖాన్‌ తదితరులు కూడా హాజరయ్యారు.