spot_img
Homeహెల్త్‌cooking : బంగాళ దుంపతో వంట మాత్రమే కాదు ఇలా కూడా చేయవచ్చు..

cooking : బంగాళ దుంపతో వంట మాత్రమే కాదు ఇలా కూడా చేయవచ్చు..

బంగాళదుంపలు అదేనండి ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టం. కొందరికి నచ్చదు. అయితే ఆలూ ఫ్రై, ఆలూ టమాట, ఆలూ పరాటా ఇలా చేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరండీ బాబూ. చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. అయితే మీరు కూడా ఆలూ లవర్సా? మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఫంక్షన్ కు ఆలును కచ్చితంగా ఉంచుతారు. ప్రతి వేడుకల్లో ఈ ఆలు ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ఆలూ ఎక్కువగా పండిస్తారు. వాటిని ప్రతి రోజు వారి వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు కూడా. మరి ఇన్ని ప్రాంతాల్లో రాజ్యం ఏలుతున్న ఆలూ అందించే ప్రయోజనాల గురించి కూడా కాస్త తెలుసుకుందాం.

బంగాళాదుంపలు మీ ప్లేట్ కోసం మాత్రమే కాదండోయ్ రోజువారీ జీవితంలో ఆశ్చర్యకరంగా ఉపయోగపడుతున్నాయి. వంటకు మించి బంగాళాదుంపలను ఉపయోగించవచ్చు. కేవలం తినడానికి మాత్రమే ఈ ఆలూ ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇప్పటి వరకు దీన్ని తినడం వల్ల కలిగే ఉపయోగాలు చూశాం కదా. కానీ ఈ బంగాళదుంపలు మరో విధంగా అంటే సృజనాత్మక, ఆచరణాత్మకంగా కూడా ఉపయోగపడుతుంది. అబ్బ ఈ పదాలు ఎందుకు కాస్త అర్థం అయ్యేలా చెప్పవచ్చు కదా అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి ఆలూ ఉపయోగాలను..

గ్లాసెస్ ను క్లీన్ చేయవచ్చు. ఇదేందిది కొత్తగా అనుకుంటున్నారా? అవును నిజమే. పచ్చి బంగాళాదుంపను సగానికి కట్ చేసి మురికి గాజు ఉపరితలాలపై రుద్దండి. దాని సహజ పిండి పదార్ధాలు ధూళిని తొలగించి, మీ అద్దాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు బంగాళాదుంప ముక్కతో మీ బూట్ల ప్రకాశాన్ని కూడా మెరుగుపరచవచ్చని మీకు తెలుసా? షూల మీద ఈ బంగాళదుంపలతో రుద్దండి. మ్యాజిక్ జరిగేలా చేసిన వారు అవుతారు. బంగాళాదుంపను ముక్కలుగా చేసి, దాని ఉపరితలంపై ఒక నమూనాను చెక్కండి. దీన్ని పెయింట్‌లో ముంచండి. క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌ల కోసం ఆహ్లాదకరమైన, రంగుల డిజైన్‌లను రూపొందించడానికి దీన్ని స్టాంప్‌గా ఉపయోగించండి.

ఈ బంగాళ దుంప ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. బంగాళాదుంప తొక్కలను ఉడకబెట్టి, మీ మొక్కలను పోషించడానికి మంచి రెమెడీగా ఉపయోగించవచ్చు. ఇది చెట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది ఈ బంగాళదుంప. విరిగిన బల్బులను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది బంగాళదుంప. మీ ఇంట్లో విరిగిన బల్బు ఉందా? ఇవి పగలడం వల్ల ఇల్లంతా అవుతాయి. బల్బు అయినా గాజు ముక్కలు అయినా సరే పగిలితే అంతే సంగతులు. సో గాయం లేకుండా మిగిలిన ముక్కలను సురక్షితంగా పట్టుకోవడానికి, తొలగించడానికి ఒక కట్ బంగాళాదుంపను సాకెట్‌లోకి నొక్కండి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version