Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప 2’ ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడంలో కూడా ఆయన చాలావరకు సక్సెస్ ని సాధిస్తూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిద్యమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ ను సంపాదించుకున్న సుకుమార్ పుష్ప 2 సినిమాని మాత్రం చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని తెరకెక్కించాడు. ఇక మొత్తానికైతే డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. దాంతోపాటుగా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులను కూడా తిరగరాసే విధంగా సుకుమార్ దీన్ని మలిచినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు 300 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడు అనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇంత భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోలు ఎవరూ లేరు కాబట్టి అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చరిత్రను సృష్టించాడనే చెప్పాలి.
ఇక ఈ విషయాన్ని మూవీ టీమ్ కూడా స్పష్టం చేయడం తో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని కనక సాధించినట్టైతే ఇండియాలో టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ట్రెస్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా మీద ఉన్న హైప్ కి ఆ సినిమా ఈజీగా 1500 కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుందనే అంచనాలయితే వేస్తున్నారు.
మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లను సాధిస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఒకవేళ ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తే అల్లు అర్జున్ స్టార్ డమ్ అనేది మరింత రేంజ్ లో పెరిగిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…