బంగాళదుంపలు అదేనండి ఆలుగడ్డలు అంటే చాలా మందికి ఇష్టం. కొందరికి నచ్చదు. అయితే ఆలూ ఫ్రై, ఆలూ టమాట, ఆలూ పరాటా ఇలా చేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరండీ బాబూ. చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. అయితే మీరు కూడా ఆలూ లవర్సా? మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఫంక్షన్ కు ఆలును కచ్చితంగా ఉంచుతారు. ప్రతి వేడుకల్లో ఈ ఆలు ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ఆలూ ఎక్కువగా పండిస్తారు. వాటిని ప్రతి రోజు వారి వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు కూడా. మరి ఇన్ని ప్రాంతాల్లో రాజ్యం ఏలుతున్న ఆలూ అందించే ప్రయోజనాల గురించి కూడా కాస్త తెలుసుకుందాం.
బంగాళాదుంపలు మీ ప్లేట్ కోసం మాత్రమే కాదండోయ్ రోజువారీ జీవితంలో ఆశ్చర్యకరంగా ఉపయోగపడుతున్నాయి. వంటకు మించి బంగాళాదుంపలను ఉపయోగించవచ్చు. కేవలం తినడానికి మాత్రమే ఈ ఆలూ ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇప్పటి వరకు దీన్ని తినడం వల్ల కలిగే ఉపయోగాలు చూశాం కదా. కానీ ఈ బంగాళదుంపలు మరో విధంగా అంటే సృజనాత్మక, ఆచరణాత్మకంగా కూడా ఉపయోగపడుతుంది. అబ్బ ఈ పదాలు ఎందుకు కాస్త అర్థం అయ్యేలా చెప్పవచ్చు కదా అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి ఆలూ ఉపయోగాలను..
గ్లాసెస్ ను క్లీన్ చేయవచ్చు. ఇదేందిది కొత్తగా అనుకుంటున్నారా? అవును నిజమే. పచ్చి బంగాళాదుంపను సగానికి కట్ చేసి మురికి గాజు ఉపరితలాలపై రుద్దండి. దాని సహజ పిండి పదార్ధాలు ధూళిని తొలగించి, మీ అద్దాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు బంగాళాదుంప ముక్కతో మీ బూట్ల ప్రకాశాన్ని కూడా మెరుగుపరచవచ్చని మీకు తెలుసా? షూల మీద ఈ బంగాళదుంపలతో రుద్దండి. మ్యాజిక్ జరిగేలా చేసిన వారు అవుతారు. బంగాళాదుంపను ముక్కలుగా చేసి, దాని ఉపరితలంపై ఒక నమూనాను చెక్కండి. దీన్ని పెయింట్‌లో ముంచండి. క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌ల కోసం ఆహ్లాదకరమైన, రంగుల డిజైన్‌లను రూపొందించడానికి దీన్ని స్టాంప్‌గా ఉపయోగించండి.
ఈ బంగాళ దుంప ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. బంగాళాదుంప తొక్కలను ఉడకబెట్టి, మీ మొక్కలను పోషించడానికి మంచి రెమెడీగా ఉపయోగించవచ్చు. ఇది చెట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది ఈ బంగాళదుంప. విరిగిన బల్బులను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది బంగాళదుంప. మీ ఇంట్లో విరిగిన బల్బు ఉందా? ఇవి పగలడం వల్ల ఇల్లంతా అవుతాయి. బల్బు అయినా గాజు ముక్కలు అయినా సరే పగిలితే అంతే సంగతులు. సో గాయం లేకుండా మిగిలిన ముక్కలను సురక్షితంగా పట్టుకోవడానికి, తొలగించడానికి ఒక కట్ బంగాళాదుంపను సాకెట్‌లోకి నొక్కండి.